గీతాంజలి మృతికి షర్మిలపై పూనమ్ ఫైర్?

Purushottham Vinay
తెనాలికి చెందిన యువతి గీతాంజలి మృతి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... టీడీపీ, జనసేన పార్టీల శ్రేణులు సోషల్ మీడియాలో చేసిన ట్రోలింగ్ ని తట్టుకోలేకే గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని వైసీపీ అరోపిస్తుంది.దీనికి సంబంధించి ప్రాథమిక విచారణలో కూడా అదే విషయం వెల్లడైనట్లు తెలుస్తుంది. ఈ సమయంలో ఈ వ్యవహారం రాజకీయంగా పెద్ద సంచలనంగా మారింది. ఈ సమయంలో ఆమె మరణానికి కారణమైనవారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్ కూడా సామాన్యుల నుంచి పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె మరణానికి కారణమైన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని, వారిని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు.ఈ సమయంలో ఆమె మృతికి టీడీపీ, జనసేన సోషల్ మీడియా జనాలు కారణమని వైసీపీ ఆరోపిస్తుంటే... ఆమె మరణంలో ఏదో కుట్ర దాగి ఉందని టీడీపీ, జనసేన పార్టీల మద్దతు దారులు ఆరోపిస్తున్నారు.ఇక ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించలేదంటూ టాలీవుడ్ మాజీ నటి పూనమ్‌ కౌర్ ఆన్ లైన్ వేదికగా రియాక్ట్ అవ్వడం జరిగింది.



ఇందులో భాగంగా ఆమె ప్రస్తుతం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న గీతాంజలి ఘటనపై వైఎస్ షర్మిళ మౌనంగా ఉండటం తనను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసిందని పూనమ్ కౌర్ అన్నారు.ఆన్లైన్ వేదికగా పూనమ్ కౌర్ స్త్రీ నాయకత్వానికి మొదటి ప్రధాన లక్షణం... స్త్రీలు, పిల్లల పట్ల కనికరంగా ఉండటమని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని కుదుపేస్తున్న గీతాంజలి ఘటనపై వైఎస్ షర్మిళ మౌనంగా ఉండటం నన్ను ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తోందని అన్నారు.తెనాలిలో సామాన్య మహిళలు, బాలికలు బయటకొచ్చి వారికి ఖచ్చితంగా పాఠం చెప్పాల్సిన అవసరం ఉందని పూనమ్‌ కౌర్ అన్నారు.గీతాంజలికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఆమె విషయంలో అసలు ఏమి జరిగింది? అసలు గీతాంజలి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఒక పార్టీకి చెందిన సోషల్ మీడియా ట్రోలర్స్ వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా? అమ్మాయిల మీద ఇలా లేని పోని పుకార్లు పుట్టించి, మానసికంగా వేధించడం కొందరికి బాగా అలవాటైపోయింది. దయచేసి వారిని కఠినంగా శిక్షించి గీతాంజలి కూతుర్లుకు న్యాయం చేయండని పూనమ్ స్పందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: