ప్రముఖ తెలుగు సినిమా మాజీ సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఏ విషయమైనా నిర్మోహమాటంగా, ముక్కుసూటిగా మాట్లాది వివాదాల్లో నిలిచే మాధవిలత రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.ఎంతమంది కలిసి వచ్చినా కూడా కచ్చితంగా ఈసారి కూడా జగనే ముఖ్యమంత్రి అవుతారంటూ బల్ల గుద్ధి చెప్పారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో ఒక వీడియోను కూడా షేర్ చేశారామె. ‘ ఆంధ్రప్రదేశ్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి బరిలోకి దిగుతున్నాయి. అయితే ‘పొత్తు పెట్టుకున్నాం..చాలా సులభంగా గెలిచేద్దాం.. జగన్ ని సాగనంపుదాం’ అంటే మాత్రం అంత సులభమేమీ కాదు. ఎందుకంటే ఆయన దగ్గర బలమైన రాజకీయ ప్రణాళికలు ఉన్నాయి. ఇంకా అలాగే పేద ప్రజలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందించారు. కాబట్టి మళ్లీ జగన్ గెలిచే ఛాన్స్ ఉంది. మరి అలాంటి వ్యక్తిని ఓడించాలంటే పొత్తు పార్టీలు చాలా కష్టపడాలి. ఆ మూడు పార్టీలు చేతుల కలిపినంత మాత్రాన అది సాధ్యం కాదు.
వారి కార్యకర్తలు కూడా సమష్ఠిగా కృషి చేయాలి. వారు ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆకట్టుకోవాలి’.మూడు పార్టీలు కష్టపడి పనిచేస్తే తప్ప.. గెలిచే అవకాశాల్లేవు. సీట్లు రావా? అంటే ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు సీట్లు వస్తాయి. కానీ అధికారం వస్తుందా రాదా?? అనే విషయం ఇక్కడ చాలా ముఖ్యం. ఒకరిపై ఒకరు ఏడుపులు ఆపి సమష్ఠిగా కష్టపడితేనే విజయం అనేది సాధ్యమవుతుంది. లేదంటే మళ్లీ జగనే ముఖ్యమంత్రి’ అని తన వీడియోలో చెప్పుకొచ్చింది మాధవీలత. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. కాగా బీజేపీ నాయకురాలిగా ఉన్న ఆమె వైసీపీకి సపోర్టుగా మాట్లాడడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దీంతో ఆమెని టీడీపీ, జనసేన, బీజేపీ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు.అయినా కూడా నిజాలు మాట్లాడంలో ఏమాత్రం తగ్గేదే లేదని మాధవి లత ట్రోలర్స్ కి కౌంటర్ ఇస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడి దాకా వెళుతుందో చూడాలి.