పల్నాడు : అపోహలు నమ్మొద్దు.. వారి సంక్షేమానికి కట్టుబడి వున్నాం..
టిడిపి హయాం లో మైనార్టీలకు అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ వైసిపి ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్ ను కూడా దూషించారని చెప్పారు. 'నారా హమారా - టిడిపి హమారా' అంటూ ముస్లిం నేతలు చంద్రబాబు నాయుడిని అక్కున చేర్చుకున్నారని చెప్పారు.దుల్హన్ పథకం, రంజాన్ తోఫా మరియు షాది ముబారక్ వంటి పథకాలను రద్దు చేసిన మైనార్టీ వ్యతిరేక వైసిపి అని, ఆ పార్టీ చేసే అసత్య ప్రచారాలను అస్సలు నమ్మొద్దని కోరారు. నరసరావుపేట లో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులు మసీదు విషయంలో ప్రశ్నించిన ముస్లిం సోదరుడు ఇబ్రహీంను హత్య చేయించారని విమర్శించారు. టిడిపి, జనసేన, బిజెపి కూటమి అధికారంలో కి వచ్చాక ముస్లిములకు మెరుగైన సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వారు చెప్పారు. మైనార్టీలంతా అపోహలు వీడాలని, ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపికి కూటమికి అండగా నిలవాలని తన గెలుపునకు కృషి చేయాలని ఆయన కోరారు.నరసరావుపేట లో టీడీపీ జెండా ఎగరేయాలని ఆయన కోరారు.