ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు మరింత దగ్గర పడుతున్నాయి. రాష్ట్రమంతా ఎన్నికల సెగ మొదలైంది. అధికారం కోసం అన్ని పార్టీలు తమ ప్రచారాల జోరు పెంచేశాయి. ఇక మేమంతా సిద్ధం అంటూ
వైసీపీ అధినేత,
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.రెండో రోజు
వైసీపీ బస్సు
యాత్ర ఆళ్లగడ్డ నుండి కొనసాగుతోంది.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్రలో భాగంగా ఎర్రగుంట్ల గ్రామంలో ప్రజలతో మమేకమయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీసిన
ముఖ్యమంత్రి జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.అయితే ఇక్కడ ఓట్లు కోసం ఒక మంత్రాన్ని
జగన్ వదిలారు.
సీనియారిటీ కాదు.. సిన్సియారిటీ చూసి ఓటెయ్యాలని ప్రజలను కోరారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చేయలేనిది.. ఐదేళ్ల కాలంలోనే చేసి చూపించానని
జగన్ అన్నారు. అలాగే తమ సంక్షేమ పథకాలపై.. ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఒక్క ఎర్రగుంట్లకు.. 58 నెలల్లో తామేం చేశామన్నది.. లెక్కలతో సహా వివరించారు
ముఖ్య మంత్రి జగన్. ఎర్రగుంట్లలో 93శాతం ప్రజలకు పార్టీలు చూడకుండా సంక్షేమం అందించామని ఆయన అన్నారు. మొత్తం 1391 మంది ఇళ్లకు చెందిన లబ్దిదారులకు ఎన్నో పథకాల ద్వారా 48 కోట్ల.. 74లక్షల 34వేల 136 రూపాయలు అందించామన్నారు
జగన్ మోహన్ రెడ్డి. మరి
జగన్ సిన్సియారిటీ మంత్రంకి జనాలు కనెక్ట్ అవుతారో లేదో చూడాలి.
ఇక జగన్
మోహన్ రెడ్డి ఉదయం 9 గంటలకు
ఆళ్లగడ్డ నుంచి బయలుదేరి నల్లగట్ల, బత్తలూరు ఇంకా అలాగే ఎర్రగుంట్ల చేరుకొని గ్రామస్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా ఆ తరువాత గోవిందపల్లి మీదగా చాబోలు శివారులో భోజనం చెయ్యడానికి గాను
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విరామం తీసుకున్నారు. తరువాత నూనేపల్లి మీదుగా
నంద్యాల చేరుకుని
గవర్నమెంట్ ఆర్ట్స్
కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత పాణ్యం, సుగాలిమిట్ట, హుస్సేనాపురం, ఓర్వకల్, నన్నూర్, పెద్దటేకూరు, చిన్నకొట్టాల, కె.మార్కాపురం క్రాస్, నాగలాపురం ఇంకా అలాగే పెంచికలపాడులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. ఈ రోజు కూడా రోడ్ షో కోసం అన్ని ఏర్పాట్లని చేయడం జరిగింది. ప్రజలతో మమేకం అయ్యేలా రోడ్ షోని ప్లాన్ చేశారు.