గత ఎన్నికలలో ఊహించని స్థాయిలో భారీ విజయాన్ని అందుకున్న జగన్ ఆ ఎన్నికలలో చరిత్ర సృష్టించారు.. ఎన్నడూ లేనంత ప్రజా అభిమానాన్ని సంపాదించుకున్నారు..ఏకంగా 151 సీట్లు సాధించి విజయ పతాకాన్ని ఎగురవేశారు.తాజాగా రాష్ట్రంలో మరోసారి సార్వత్రిక ఎన్నికల నగారా మ్రోగింది.. ఈ సారి కూడా తిరుగులేని విజయం కోసం జగన్ పావులు కదుపుతున్నారు.. దీనిలో భాగంగానే ‘వై నాట్ 175’ అనే నినాదంతో ముందుకెళ్తున్నారు.. ప్రజలలో తిరిగే నేతలకే ఈసారి టిక్కెట్లను కేటాయించడం జరిగింది..దాదాపు 50 మంది ఎమ్మెల్యేలకు సీటు నిరాకరించి సంచలనం సృష్టించారు. మరికొందరి నేతలకు స్థానచలనం కల్పించి ప్రతి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ సాధించే విధంగా నేతలకు దిశానిర్దేశం చేశారు. అయితే గత ఎన్నికలలో ఘోర ఓటమి పాలైన టీడీపీ ఈ సారి ప్రధాన ప్రతిపక్షాలైన జనసేన, బీజేపీ లను కలుపుకొని కూటమిని ఏర్పాటు చేసింది..
కూటమిలో భాగంగా ఇరు పార్టీలు సీట్ల కేటాయింపులలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎక్కడో ఒకచోట అసమ్మతి సెగ రేగుతూనే వుంది. అయితే కూటమి నాయకులు సీటు దక్కని నేతలను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.. ఈ సారి కలిసికట్టుగా జగన్ పై యుద్దాన్ని ప్రకటించారు.. అయితే ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన వైసీపీ నే మరోసారి అధికారంలోకి వస్తుందని పార్టీ అధినేత జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికలలో అధికార పార్టీ తమ వద్ద వున్న అన్ని అస్త్రాలను బయటకు తీస్తుంది.
గెలుపే లక్ష్యంగా జగన్ పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారు. రాయలసీమ లో వైసీపీ బలంగా కనిపిస్తున్నప్పటికి కోస్తా తో పాటు, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలలో కొంత ప్రతికూలత వ్యక్తం అవుతుంది..దీనితో ఆయా జిల్లా నేతలతో సీఎం జగన్ నేరుగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా గత ఎన్నికలలో మెజారిటీ తగ్గిన స్థానాలలో ప్రత్యేక దృష్టి సాధించారు.ఈ స్థానలను కాపాడుకోకపోతే అధికారానికి దూరం కావడం ఖాయం అని జగన్ ఒక నిర్ణయానికి వచ్చారు. మొత్తం 68 నియోజకవర్గాలపై జగన్ రివ్యూ చేసినట్లు సమాచారం.