రాయలసీమ: జగన్ బస్సు యాత్ర తుస్... సొంత పార్టీ వాళ్లే కుంపట్లు పెట్టేశారా...!
వైఎస్ జగన్ ప్రస్తుతం సీఎం. రాష్ట్రంలో అధికార పార్టీకి ఆయన అధినేత. దీంతో ఆయనతో కరచాలనం చేయాలని, ఫొటో దిగాలని ఎంతో మంది కార్యకర్తలు ఎదురు చూస్తుంటారు. అలాంటి వారందరూ జగన్ అనుసరిస్తున్న వైఖరితో ఖంగుతింటున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేవలం 50 మందికి మాత్రమే ఆయన ఫొటోలు దిగేందుకు అనుమతి ఇస్తున్నారనే ప్రచారం సాగుతోంది. దీంతో తమ అభిమాన నేత పెట్టే నిబంధనలు క్యాడర్‌కు ఏ మాత్రం రుచించడం లేదు. అంతేకాకుండా ఆళ్లగడ్డలో రాజకీయ పరిస్థితిపై స్థానిక ఎమ్మెల్యే బ్రిజేంద్రనాథ్ రెడ్డితో ఏ మాత్రం చర్చించలేదని సమాచారం. అయితే కేవలం మేధావులు, తటస్థులతో సమావేశం నిర్వహించి మమ అనిపించేశారని స్థానిక పార్టీ క్యాడర్ బాధ పడుతోంది. బస్సు యాత్రలో జగన్ అనుసరిస్తున్న వైఖరి పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశను నింపుతోంది. దీంతో జగన్ బస్సు యాత్ర తుస్సుమందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీలో కొందరు జగన్ బస్సు యాత్ర ఇలా జరగడానికి కారణమని విమర్శలొస్తున్నాయి. అయితే వైసీపీ నష్టనివారణ చర్యలు చేపడుతుందా లేక ఇదే తరహాలో యాత్ర ముందుకు సాగుతుందా అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.