లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎవరికి టికెట్ వస్తుందన్న ఆసక్తి నెలకొంది. అయితే టికెట్లు ప్రకటించడంలో అధికార కాంగ్రెస్ కంటే BRS, bjp కాస్త ముందే ఉన్నాయి. కాంగ్రెస్ మాత్రం ఆచితూచి అభ్యర్థులను ప్రకటిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించకపోవడం ఆశ్చర్యకరం.
ఇక్కడనుండి బిజెపి తరఫున సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ బరిలో దిగుతున్నారు. బండి సంజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై ఇప్పుడు ఎంపీగా టికెట్ దక్కించుకుని మరోసారి పోటీలో నిలిచారు. ఇక బీఆర్ఎస్ నుండి వినోద్ కుమార్ పేరును ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. దీంతో బండి సంజయ్, వినోద్ కుమార్ పార్లమెంట్ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సమావేశాలు సభలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే కాంగ్రెస్ మాత్రం కరీంనగర్ అభ్యర్థి విషయంలో ఇంకా సందిగ్ధంలోనే ఉండిపోయింది. ఇక్కడనుండి పోటీకి కాంగ్రెస్ అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావు, తీన్మార్ మల్లన్న పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో తీన్మార్ మల్లన్న నాన్ లోకల్ కాబట్టి ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నట్టు ఇండియా హెరాల్డ్ కు అందిన సమాచారం. ఇప్పటికే తీన్మార్ మల్లన్న భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి టికెట్ ఆశించి భంగపడ్డారు.
ఆశలపై కూడా గండిపడింది. దీంతో ఆయన కరీంనగర్ టికెట్ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇక కరీంనగర్ పార్లమెంట్ నుండి వెలిశాల రాజేంద్ర రావు కంటే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డికి టికెట్ దక్కే అవకాశాలు ఉన్నట్టు కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే వినోద్, బండి సంజయ్ ఇద్దరు బలమైన నాయకులు కావడంతో చివరికి కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.