రాయలసీమ: చంద్రబాబుకే సవాల్ గా మారిన హిందూపురం..!!
నిన్నటి రోజున బిజెపి ఆంధ్ర అధ్యక్షురాలు పురందేశ్వరీని కలిసిన తర్వాత ఆయన పలు విషయాలను మీడియాతో మాట్లాడారు.. పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ తాను హిందూపురం నుంచి ఎంపీ, ఎమ్మెల్యేగా టికెట్ టికెట్టు కోసం పురందేశ్వరి గారిని కలిశాను.. పొత్తులు కుదరక ముందే తాను బిజెపి హిందూపురం ఎంపీగా పోటీ చేయాలనుకున్నాను తన అభిప్రాయాన్ని కూడా అధిష్టానానికి తెలపడానికి వెళ్లాలని తెలిపారు. ఉదయం పార్టీలో చేరి మధ్యాహ్నానికి వారు అభ్యర్థులు అయిపోయారు అంటూ అసహనాన్ని తెలియజేశారు.
పొత్తు వల్ల బిజెపి కూడా ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది.. అందుకే తాను స్వతంత్ర ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలిపారు.. హిందూపురం నియోజకవర్గాన్ని వదిలేదే అంటూ తేల్చి చెప్పారు.. హిందూపురంలో నుంచే నేను పోటీ చేస్తే ముస్లింలు ఓట్లు రావు అని చంద్రబాబు అన్నారు.. తానేంటో ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేసి చూపిస్తానంటూ కూడా చంద్రబాబుకు సవాల్ విసురుతున్నారు పరిపూర్ణానంద.. తాను ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండే వ్యక్తినంటూ బిజెపి నేతల మాటలు మార్చే వ్యక్తిని కాదంటూ కూడా పరోక్షంగానే సెటైర్లు వేశారు. ఇప్పుడు హిందూపురం నియోజకవర్గ చంద్రబాబుకు ఒక తలనొప్పిగా మారుతున్నది. మరి ఈ విషయం పైన మరొకసారి చంద్రబాబు అందరి నేతలతో మాట్లాడతారేమో చూడాలి మరి.