రాయలసీమ : ఆ ఎమ్మెల్యేకి అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన వైఎస్ జగన్..?
ఇందులో భాగంగానే పోతులకి, జిమ్మికులకి, ఇంకా అనేక మోసాలను అన్నిటిని ఎదుర్కొని తాను పేదల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు ఉన్నానంటూ 'మేమంతా సిద్ధం' బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఇదే సభలో 2019లో కర్నూల్ నుండి ఎమ్మెల్యే గా ఎన్నికైన హఫీజ్ ఖాన్ కు మళ్లీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోయామని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా ఆఫీస్ ఖాన్ ను రెండేళ్ల తర్వాత ఖచ్చితంగా రాజ్యసభకు పంపిస్తాను అంటూ తెలియజేశారు.
ఈ విషయంలో తన మనసులో ఎలాంటి కల్మషం లేదు కాబట్టి.. తాను ప్రజల వద్ద బహిరంగంగా ఇలాంటి విషయాలు చెబుతున్నట్లు తెలియజేశారు. ఇకపోతే 2024 ఎన్నికల కాను సెట్టింగ్ ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్ కాదని ఈసారి ముస్లిం వర్గానికే చెందిన ఇంతియాజ్ కు వైఎస్ఆర్సిపి అధిష్టానం నుంచి టికెట్ కేటాయించడం జరిగింది. చూడాలి మరి ముందు ముందు హఫీజ్ ఖాన్ రాజ్యసభలో అడుగుపెడతాడో లేదో మరి. ఎన్నికల్లో జరిగిన సభలో భాగంగా ముఖ్యమంత్రి తాము 58 నెలల్లో రాష్ట్రంలో అనేక విప్లమాత్మపక మార్పులు తీసుకొచ్చామని.. తాము చేసిన మంచిని కొనసాగించాలని రాష్ట్రంలోని ప్రతి గుండె కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో ప్రజలు పెత్తందారులను ఓడించి నీ బిడ్డకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరాడు. చూడాలి మరి ప్రజలు ఎవ్వరికి ఓట్లు వేసి అధికారంలోకి తీసుకు వస్తారో.