ఆంధ్రప్రదేశ్: ఈసారి ఎన్నికలతో ఈ సీనియర్ మోస్ట్ నాయకుల దుకాణం బంద్..?
తెనాలి మాజీ ఎమ్మెల్యే, మాజీమంత్రి ఆలపాటి రాజా కెరీర్ ముగిసినట్లే అనిపిస్తోంది. ఈ సీనియర్ మోస్ట్ పొలిటిషన్ దాదాపు 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. ఈయన చంద్రబాబుకు అత్యంత ఆప్తుడు. టీడీపీ పార్టీలోని టాప్ టెన్ నాయకులలో ఆయన కూడా ఒకరిగా ఉన్నారు. అంత అనుభవం, ప్రజల్లో పేరు ఉన్న ఆయనకు ఈసారి ఎన్నికల్లో సీటు ఇవ్వలేదు. టీడీపీ జనసేన పార్టీతోటి పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ఇవ్వాల్సిన సీటును జనసేనకే కట్టబెట్టారు చంద్రబాబు. ఆల్మోస్ట్ ఈ నేత కెరీర్ మిగియడానికి వచ్చింది అలాంటి సమయంలో ఏ సీటు ఇవ్వలేదు. నెక్స్ట్ టైమ్ ఇస్తారనే గ్యారెంటీ కూడా లేదు. ఆయన కూడా పోటీ చేయకపోవచ్చు.
అలాగే టీడీపీ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు కూడా రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాలో చక్రం తిప్పిన ఈ సీనియర్ మోస్ట్ నాయకుడు ఈసారి ఎన్నికలలో సీటు దక్కించుకోలేకపోయారు. కెరీర్ చివరి దశలో ఆయనకు సీటు ఇవ్వలేదంటే ఇకపై ఇవ్వకపోవచ్చు. ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇచ్చే అవకాశం ఉంది. లేదంటే అతని రాజకీయ జీవితానికి ఎండ్ కార్డు పడినట్లే.
జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు వంటి బిజెపి నేతల రాజకీయ జీవితం కూడా ఈసారితో ముగిసిపోయినట్లేనని స్పష్టంగా తెలుస్తోంది. మిగతా సీనియర్ నేతలు కూడా ఈ ఎన్నికలతో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.