బిఆర్ఎస్ : కేసీఆర్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులు?
టికెట్ వచ్చినవారు సైతం ఇక కాంగ్రెస్ గూటికి చేరుకుంటూ ఉండటంతో మిగతా నేతలు అందరిలో కూడా అంతర్మతనం మొదలైంది అని చెప్పాలి. ఇప్పటికే కేకే, కడియం శ్రీహరి లాంటి సీనియర్ నేతలు సైతం పార్టీని వీడారు. కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్లు బహిర్గతంగానే ప్రకటించారు. కానీ లోలోపల మాత్రం మరిన్ని చర్చలు జరుగుతున్నాయి అన్నది అందరూ అనుకుంటున్న మాట. అయితే ఇటీవలే బిఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య టికెట్ను సైతం వదులుకొని పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరింది. ఇప్పుడు కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు రెడీ అవుతుంది. ఇక చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి సైతం కారు దిగి చేయి అందుకున్నారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.
ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటుకు గురైన బిఆర్ఎస్ పార్టీకి ఇలా కీలక నేతలు దూరమయ్యాక పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడం మరింత కష్టమవుతుంది. అయితే ఇప్పుడు కెసిఆర్ కు మరో బిగ్ షాక్ తగలబోతుంది అన్నది తెలుస్తుంది. బిఆర్ఎస్ లో టికెట్ వదులుకొని కాంగ్రెస్ లోకి వెళ్ళిన వారికి అక్కడ ఎంపీ టికెట్ దక్కుతున్న నేపథ్యంలో.. మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులు కూడా ఇలా కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుకోబోతున్నారు అన్న ప్రచారం మొదలైంది. దీంతో ఆ ఇద్దరు ఎంపీలు ఎవరు అనే విషయంపై క్లారిటీ లేక అటు బిఆర్ఎస్ నాయకులు సైతం కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఇలా టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరేందుకు ఇప్పటికే లోలోపల చర్చలు కూడా ముగిసాయట. త్వరలోనే ఈ విషయం బయట పడే ఛాన్స్ ఉందట. అయితే మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులు ఇలా బిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి వెళ్లి అక్కడ నుంచి పోటీ చేశారంటే ఈ వలసల పర్వం మరింత పెరిగే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.