రాయలసీమ: పరిటాల శ్రీరామ్ అనూహ్య నిర్ణయం.. వైసీపీకి హెచ్చరికేనా..?

Divya
రాయలసీమలోని అనంతపురంలో పరిటాల రవి ...శ్రీరామ్ అంటే ఒక బ్రాండ్ గా ఏర్పడింది.. టిడిపికి కంచుకోటగా ఉన్న ఈ కుటుంబం ఎన్నో ఏళ్లుగా పొలిటికల్ పరంగా కొనసాగుతూ ఉన్నారు.. అయితే ఈసారి ఎన్నికలలో ధర్మవరం టికెట్ ఆశించిన పరిటాల శ్రీరామ్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. కూటమిలో భాగంగా తనకు సీటు రాలేదని ఇది కొంత బాధగా ఉన్నప్పటికీ అలాగని పార్టీని వీడిపోనంటూ పార్టీ అధిష్టానం మేరకే అక్కడ బిజెపి నేత సత్యకుమార్ కు టికెట్ ఇచ్చారనీ తెలియజేశారు.. ఈ విషయం తనకు సంతోషంగా ఉందని కూడా తెలిపారు శ్రీరామ్.

ఇండియన్ హెరాల్డ్ కు అందిన కథనం మేరకు పరిటాల శ్రీరామ్ అక్కడ బిజెపి అభ్యర్థిని గెలిపించేందుకు ప్రయత్నిస్తానంటూ తెలియజేశారు.. ఐదేళ్ల క్రితం శ్రీరామ్ వేరని..ఇప్పుడు వేరని వ్యాఖ్యానించారు.. ధర్మవరంలో ప్రతి కార్యకర్త టిడిపి జెండాతో ధైర్యంగా అడుగు ముందుకు వేయాలంటూ తెలియజేశారు.. బిజెపి సీనియర్ నాయకుడు సత్యకుమార్ ను గెలిపించాల్సిన బాధ్యత అందరి వైపు ఉందంటూ తెలిపారు. ఇప్పటికే ధర్మవరం పేరు ఢిల్లీ వరకు వినిపించిందని ఎన్నికల తర్వాత మరింత పేరు వినిపించాలని కార్యకర్తలకు సూచించారు పరిటాల శ్రీరామ్..

ధర్మవరం అభ్యర్థి సత్యకుమార్ వెనుక శ్రీరామ్ ఉన్నారంటూ ఇది వైసిపి నాయకులకు గట్టి హెచ్చరిక అంటూ తెలియజేస్తున్నారు.. కూటమిలో ఉన్న ప్రతి పార్టీకి కూడా తాను అండగా ఉంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీరామ్.. ఇండియన్ హెరాల్డ్ కు  అందిస్తోన్న సమాచారం మేరకు  కొంతమంది లాగా ఓడిపోయిన తర్వాత కార్యకర్తలను వదిలేసే టైపు కాదంటూ పరోక్షంగా వరదాపురం సూరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.. ధర్మవరంలో టిడిపి సింబల్ మాత్రమే లేదని బిజెపి ఉన్న అది టిడిపి కిందికే వస్తుందంటూ తెలియజేశారు.. టికెట్ ఇవ్వక పోయినంత మాత్రాన పారిపోయో వ్యక్తిని కాదంటూ.. త్యాగం మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపిస్తాను అంటూ తెలియజేశారు.. కష్టం వచ్చిన నష్టం వచ్చిన తన ప్రయాణం మాత్రం ధర్మవరంలోనే అంటూ శ్రీరాం తెలియజేశారు.పరిటాల శ్రీరామ్ తీసుకున్న ఈ  అనూహ్య నిర్ణయం.. వైసిపి నాయకులకు హెచ్చరించేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: