కాంగ్రెస్ : పార్టీలో చేర్చుకోలేదని అలా అంటున్నాడు.. షాకింగ్ విషయం చెప్పిన కోమటిరెడ్డి?
గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కీలక పదవులు చేపట్టిన కడియం శ్రీహరి, కేకే లాంటి కి సీనియర్ నేతల సైతం పార్టీ వీడడంతో మిగతా నేతలు అందరిలో కూడా అంతర్మదనం మొదలైంది. అయితే రానున్న రోజుల్లో మరి కొంతమంది బిఆర్ఎస్ నేతలు సైతం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని అటు రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఇలా బిఆర్ఎస్ లోని అభ్యర్థులందరూ కాంగ్రెస్ లోకి వెళ్లి ఇక గులాబీ పార్టీ ఖాళీ అవుతుందని అందరూ అనుకుంటున్న వేళ.. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాత్రం సంచలన కామెంట్స్ చేశారు.
ఎంతోమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని.. పార్లమెంట్ ఎన్నికల ముగిసిన తర్వాత ఇక పార్టీని వీడుతారు అంటూ మహేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి. మరోవైపు కాంగ్రెస్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏక్ నాథ్ షిండే అవుతారు అంటూ మహేశ్వర్ రెడ్డి కామెంట్స్ చేశారు. ఇక ఈ విషయంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. నాపై ఆయన చేసిన వ్యాఖ్యలు సత్య దూరమైనవి. మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీలోకి వస్తానని ఆయనే స్వయంగా అడిగారు. కానీ మాకు మెజారిటీ ఉంది కాబట్టి అవసరం లేదని చెప్పాను. ఇలా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోలేదని ఆయన ఏదో మాట్లాడుతున్నారు అంటూ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు.