ఏపీ : రాజకీయమంతా పెన్షన్ చుట్టే తిరుగుతుంది?
అయితే గత కొన్ని రోజుల నుంచి ఏపీలో రాజకీయం మొత్తం అటు వృద్ధుల పెన్షన్ల చుట్టూ తిరుగుతుంది. గ్రామ వాలంటీర్లు ఏకంగా వైసిపి కార్యకర్తలుగా మారిపోయారని.. ఇక వారు పథకాల పేరుతో అటు వృద్ధులకు డబ్బులు పంచుతూ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ టిడిపి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. దీంతో పెన్షన్ల పంపిణీలో వాలంటీర్ల జోక్యం ఉండదు అంటూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇవ్వడం సంచలనంగా మారిపోయింది. ఇదే విషయం గురించే ప్రస్తుతం టిడిపి కూటమి, అధికార వైసీపీ మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు కూడా జరుగుతూ ఉన్నాయి.
పేదలకు నష్టం కలిగే విధంగా చంద్రబాబు ఏకంగా పెన్షన్లను అడ్డుకున్నాడని వైసిపి ఆరోపిస్తోంది. ఇక వృద్ధుల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది అంటూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా టిడిపి పెన్షన్లను ఆపేయడం కారణంగా ఎంతోమంది అవ్వ తాతలు ఇబ్బంది పడుతున్నారు అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు వైసీపీ నేతలు. అయితే తాము ఎక్కడ పెన్షన్లను ఆపాలని చెప్పలేదని.. వాలంటీర్ల సహాయం లేకుండా పెన్షన్ అందించాలని చెప్పాము అంటూ టిడిపి వైసిపి చేస్తున్న ఆరోపణలను తిప్పి కొడుతుంది. ఇలా గత కొన్ని రోజుల నుంచి ఏపీ రాజకీయమంతా వృద్ధుల పెన్షన్ల చుట్టే తిరుగుతుంది.