ఏపి: ఈసీకి టీడీపీ మరో వినతి... వాళ్ల ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?
రాష్ట్రంలో ఎన్నికల విధుల కోసం ప్రస్తుతం సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులకు యథావిధిగా ఈసీ అప్పగిస్తోంది. అయితే ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచడంతో 60 ఏళ్లు పైబడిన వారు కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. వీరికి సక్రమంగా విధులు నిర్వహించడం కష్టంగా ఉంది. అయితే ఈసీ ఇప్పుడు వారిని కూడా ఎన్నికల విధుల్లోకి తీసుకుంటోంది.
దీనిపై ప్రతిపక్ష టీడీపీ స్పందిస్తూ.. రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పోలీసులను ఎన్నికల విధుల నుంచి మినహాయించాలని ఈసీని కోరింది. ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ మినహాయింపు కోరడానికి గల కారణాలను కూడా ఆయన వివరించారు. 60 ఏళ్లు పైబడిన ఉద్యోగులు ఎన్నికల ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారని అన్నారు.
గుండె జబ్బులతో బాధపడుతున్నవారు, గర్భిణీ స్త్రీలు, దివ్యాంగులు ఉన్న పిల్లలు, కోవిడ్ 19 బారిన పడిన వారికి ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. దీనిపై ఈసీ స్పందించాల్సి ఉంది.
గత సంవత్సరంలో రాష్ట్రంలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో ఎన్నికలను ప్రభావితం చేసే కుట్ర జరుగుతోందని రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్‌కు చెందిన ‘సిటిజన్ ఫర్ డెమోక్రసీ’ సుప్రీం కోర్టులో వేసిన పిల్‌పై మంగళవారం విచారణ జరిగిన విషయం తెలిసిందే.