ఆ ఒక్క మాటతో.. రఘునందన్.. కేసిఆర్ ను ఇరకాటంలో పడేసాడే?

praveen
ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో నేపథ్యంలో మెదక్ లో రాజకీయం వేడెక్కింది  ఇప్పటికే ప్రధాన పార్టీలుగా కొనసాగుతున్న కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీలు ఇక మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో బరిలోకి దిగబోయే అభ్యర్థుల వివరాలను ప్రకటించాయి. బిజెపి నుంచి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.. బరిలోకి దిగుతూ ఉండగా బిఆర్ఎస్ నుంచి పెద్దగా రాజకీయ అనుభవం లేని వెంకటరామిరెడ్డికి ఛాన్స్ ఇచ్చింది పార్టీ. అయితే బీఎస్పీ నుంచి కాంగ్రెస్లో చేరిన నీలం మధు ముదిరాజ్ కు బీసీ కోటా కింద మెదక్ ఎంపీ సీటును కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం.



 ఈ ముగ్గురు అభ్యర్థులు మెదక్ పార్లమెంట్ స్థానంలో మేము గెలుస్తాం అంటే మేము గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా అటు బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. అయితే బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు లోకల్ నాన్లోకల్ అనే టాపిక్ ను తిరమీదికి తెచ్చి ఒక రకంగా కేసీఆర్ ను ఇబ్బందుల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. స్థానికేతరుడు అయిన వెంకటరామిరెడ్డి కి ఎలా టికెట్ ఇస్తారు అంటూ ప్రశ్నించాడు రఘునందన్ రావు.


 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బిఆర్ఎస్ పార్టీలో స్థానికులు, ఉద్యమకారులే లేరా అంటూ ఏకంగా గులాబీ దళపతి కేసీఆర్ సైతం ఆత్మ రక్షణలో పడేసే ప్రయత్నం చేశారు రఘునందన్ రావు. పదేళ్లు పాలించిన బిఆర్ఎస్ కు మెదక్ లో నిలబెట్టేందుకు స్థానిక అభ్యర్థి దొరకపోవడం బాధాకరం అంటూ అన్నారు. వందల కోట్లు తీసుకుని బిఆర్ఎస్  ఏకంగా సీట్లు అమ్ముకుంటుంది అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. అయితే ఇలా పూర్తిస్థాయిలో ప్రచారం ప్రారంభం కాకముందే విమర్శలతో విరుచుకుపడుతున్న రఘునందన్ రావు ప్రచార రంగంలోకి దిగిన తర్వాత ఇలా లోకల్ నాన్లోకల్ అనే నినాదాన్ని మరింత పటిష్టంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అనుకుంటున్నాడట. .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: