ఓటర్ల తెలివి ముందు.. అభ్యర్థులే ఓడిపోతారా?
అయితే ఎన్నికలు వస్తే హడావిడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రచారంలో దూసుకుపోతూ ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అభ్యర్థులు. కొంతమంది ఏకంగా డబ్బులు పంచడం చేస్తే.. ఇంకొంతమంది మద్యం ఏరులై పారిస్తూ ఉంటారు. మరి కొంతమంది విలువైన కానుకలు ఇవ్వడం చేస్తూ ఉంటారు. అయితే అభ్యర్థులు ఇలా ఓటర్లను అకట్టుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫైనల్ డెసిషన్ మాత్రం ఓటర్లదే.
అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృశ్య ఓటర్ల తెలివి ముందు అభ్యర్థులే ఓడిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఓటర్లు బాగా తెలివిగా ఆలోచిస్తున్నారు. మా పార్టీవాళ్ళే మనకు కాకపోతే ఇంకెవరికి ఓటు వేస్తారు అనుకునే పరిస్థితి అస్సలు లేదు. ఒకప్పటిలా డబ్బు మందు పంచిన వాళ్ళకి కాదు అభివృద్ధి చేసేటోడికి.. మా కోసం నిలబడతాడు అనే నమ్మకాన్ని ఇచ్చిన వారికే ఓటు వేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఊహకందని రీతిలో ఓటర్ల వ్యూహాలు ఉంటున్నాయి అని చెప్పాలి. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్న కేంద్రంలో మాత్రం బిజెపి ఉండాలని కొంతమంది.. రాష్ట్రంలో ఉన్న పార్టీకి చెందిన అభ్యర్థులని పార్లమెంట్ ఎలక్షన్లలో గెలిపించుకుంటే అభివృద్ధి చేసి చూపిస్తారని మరి కొంతమంది అనుకుంటున్నారు.