గోదావరి: చంద్రబాబు మోసం జీవితాంతం మరవను.. టీడీపీని ఓడించి కసి తీర్చుకుంటా..!
2019 ఎన్నికలలో చంద్రబాబు సూచన మేరకు తాను నరసాపురం పార్లమెంట్‌కు తన కజిన్ బ్రదర్ మంతెన రామరాజు ఉండి అసెంబ్లీకి పోటీ చేశారు. ఆ ఎన్నికలలో రామరాజు ఉండిలో ఎమ్మెల్యేగా గెలిస్తే శివ నరసాపురం పార్లమెంటుకు పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. గత ఎన్నికలలో భవిష్యత్తులో తన ఉండి అసెంబ్లీ సీటును తనకే ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు తనను పూర్తిగా పక్కన పెట్టి రామరాజుకి ఇచ్చి.. తనకు వెన్నుపోటు పొడిచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటు తాను సీటు ఇచ్చి గెలిపించిన ఎమ్మెల్యే రామరాజు సైతం నియోజకవర్గంలో తన వర్గాన్ని, తన అభిమానులను పూర్తిగా రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేశారని కూడా వాపోతున్నారు. శివకు.. చంద్రబాబు ఎలాగూ సీటు ఇవ్వకపోవడంతో.. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు. ఎన్నికల్లో ఎలాగైనా ఇండిపెండెంట్గా గెలిచి.. చంద్రబాబుకు తన సత్తా ఏంటో చాటాలని శివ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
లేనిపక్షంలో భారీగా ఓట్లు చీల్చి.. టీడీపీ అభ్యర్థిని ఓడించేందుకు కూడా తాను వెనకాడనని శివ పంతంతో ఉన్నట్టు క్లియర్‌గా తెలుస్తోంది. ఇప్పటికే శివను కూల్ చేసేందుకు ఆ జిల్లాకు చెందిన టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు కూడా విఫలం కావడంతో.. శివ ఉండిలో ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే నామినేషన్ల పర్వం స్టార్ట్ అయ్యే టైంకు అయినా శివను వైసీపీ లోకి తీసుకువెళ్లి సీటు ఇచ్చే ప్రయత్నాలు కూడా మిథున్ రెడ్డి మొదలు పెట్టారని టాక్ ?