ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఉత్కంఠత రేపుతుంది.. రాష్ట్రంలో మరి కొద్ది రోజులలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ ఇప్పటికే తమ అభ్యర్థులతో బరిలోకి దిగాయి..అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శ, ప్రతి విమర్శలు చేసుకుంటూ ప్రచార హోరు కొనసాగిస్తున్నారు.అధికార పార్టీ వైసీపీ అధినేత వై ఎస్ జగన్ “మేమంతా సిద్ధం” పేరుతో 21 రోజుల పాటు బస్సు యాత్ర చేపట్టారు. ప్రతి పక్షాలపై తీవ్ర విమర్శలు చేస్తూ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు “ప్రజాగళం” పేరుతో అధికార పార్టీ మోసాలు ప్రజలకి తెలియజేస్తున్నారు.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఆసక్తికరంగా మారింది.. అందులో నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది.ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి చీరలకు చారిత్రాత్మక ప్రాధాన్యత వుంది..దేశ వ్యాప్తంగా ఈ చీరలకు ప్రత్యేకం గుర్తింపు వుంది. ఈ సెగ్మెంట్ లో ఆనం కుటుంబానికి పట్టుంది.
గత అసెంబ్లీ ఎన్నికలలో ఆనం రాంనారాయణరెడ్డి వైసీపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు..ఆ తరువాత ఆనం వైసీపీ అధిష్టానంపై దిక్కార స్వరం వినిపించారు..సీఎం జగన్, వైసీపీలపై ఆనం నారాయణరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధికి ఓటు వేయడంతో ఆనంను పార్టీ నుంచి జగన్ సస్పెండ్ చేశారు..దీంతో ఆయన టీడీపీ లో చేరారు..దీనితో 2024 అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని జగన్ ప్రకటించారు..నేదురు మళ్ళీ జనార్దన్ రెడ్డి తనయుడిగా మంచి గుర్తింపు కలిగి ఉండటం.నియోజకవర్గంలో తన కుటుంబానికి వున్న బ్రాండ్ ఇమేజ్, రెడ్డి సామాజికవర్గానికి పట్టు అలాగే వైసీపీ సంక్షేమ పాలన తనను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు..ఇక టీడీపీ విషయానికి వస్తే కురుగొండ్ల లక్ష్మీ సాయి ప్రియ కు టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సారి సీటు కేటాయించారు.నియోజకవర్గంలో జగన్ పాలనపై వ్యతిరేకత ఈ సారి టీడీపీ, జనసేన బీజేపీ కలిసి పోటీ చేయడం వంటి అంశాలు తనకు కలిసి వస్తుందని లక్ష్మి ప్రియ భావిస్తున్నారు..మరి ఈ సారి గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి..