తిరుపతి: రోజా - జగన్ మధ్య అసలు వయసు తేడా ఇదే..!
అయితే రోజా అంటే ఒక వర్గం వారిలో విపరీతమైన కడుపు మంట. ఎక్కువగా మెగా అభిమానులకి ఉంటుంది. ఎందుకంటే గతంలో టిడిపి పార్టీలో కొనసాగిన రోజా.. ఎక్కువగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించింది. ఇప్పుడు వైసిపి పార్టీలోకి చేరిన తర్వాత కూడా.. టిడిపి - జనసేన కూటమిలో భాగంగా మళ్లీ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుండడంతో మెగా అభిమానులు ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా అభిమానులకు పూర్తిస్థాయిలో రోజాపై కోపం ఉంటుంది. అలాగే టిడిపిలో కూడా కొంతమందికి రోజా అంటే పడని సందర్భాలు కూడా ఉన్నాయి.. ప్రత్యేకించి అనిత లాంటి వాళ్లకు రోజా అంటే అసలు పడదు. ఒకప్పుడు రోజా కారణంగా అనిత ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొంది. దీంతో వయసుకు సంబంధించి ట్రోల్స్ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
అసలు విషయంలోకి వెళ్తే.. జగన్ కంటే రోజా ఒక నెల వయసులో పెద్దది అన్నట్టు తెలుస్తోంది.. డిసెంబర్ 21 1972లో జగన్ జన్మిస్తే.. రోజా నవంబర్ 17 1972 లో జన్మించారు. దీంతో ఒక్క నెల పెద్దది అంటూ టీడీపీ వర్గం వారు ప్రొజెక్ట్ చేస్తున్నారు. మొత్తానికి అయితే వీళ్ళ ఆవేశం , కోపం కారణంగా వీరి వయసులు కూడా బయటపడుతున్నాయి..