గోదావరి : సొంత పార్టీని ఓడించే పనిలో ఆళ్లనాని ఉన్నారా..?

FARMANULLA SHAIK
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏలూరు నియోజకవర్గం హాట్ టాపిక్ గా నిల్చింది.టీడీపీ అభ్యర్థి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో గడప గడపకి ప్రచారం చేస్తుంటే అధికార వైసీపీ అభ్యర్థి మాత్రమే ఎక్కడ కనబడట్లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.రాజకియం పరంగా ఎంతో చైతన్యం ఉన్న ఏలూరు నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్న లేకున్నా ఒకటే అంటున్నారు అక్కడి ప్రజలు.దానికి కారణం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల నాని ప్రజలను పట్టించుకోకపోవడమే.జగన్ గారి ప్రోత్సహంతో గత ఎన్నికల్లో గెలిచి ఏపీ కాబినెట్లో ఉపముఖ్యమంత్రిగా మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేసారు.కోవిడ్ సమయంలో బాగా డబ్బులు వెనకకి వేసుకోవడంతో జగన్ మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి కోల్పోవడంతో అప్పటినుండి ప్రజలకు అలాగే పార్టీకి అంటిఅంటనట్టుగా ఉంటున్నారని సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేస్తున్నారు.ప్రజల్లో తిరగకపోయినా గెలవగలను అన్నా ధీమాతో ప్రచారం కూడా సరిగ్గా చేయట్లేదని ఈసారి టీడీపీ అభ్యర్థిని గెలిపించి ఆళ్ల నాని ని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధం అని ప్రతిపక్షాలు అంటున్నాయి.
ఆళ్ల నానిని అభ్యర్థిగా మార్చమని అక్కడి నేతలు చెప్పిన అక్కడ వేరే అభ్యర్థి లెకపొవడంతో అతనికే టికెట్ దక్కింది.మంత్రిగా ఉన్నప్పుడు అతను తీసుకున్న నిర్ణయాలే అతన్ని ఒదించేందుకు పునాదులుగా మారాయి అనిసొంత నేతలే అంటున్నారు.అధికార మదంతో అక్కడ ఒక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ పై ఉక్కుపాదం మోపారని ప్రజలు అంటున్నారు.
గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బడేటి బుచ్చి మరణంతో అతని కుటుంబానికి చెందిన బడేటి చంటికి టీడీపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది.ఆయన నియోజకవర్గ ప్రజలతో ఎప్పుడు మమేకమై ఉంటూ అందరిని కలుపుకు పోతు మంచి పేరు తెచ్చుకుంటున్నారు.టీడీపీ నాయకులు కూటమితో కలిసి దూసుకుపోతున్నారు.చాలా మంది వైసీపీ నేతలు ఆళ్ల మీద ఉన్న వ్యతిరేకతతో టీడీపీలో చేరుతున్నారు. దాంతో ఈసారి ఏలూరులో టీడీపీ జండా ఎగరడం మాత్రం కచ్చితంగా జరుగుతుంది అని అక్కడి ప్రజలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: