బిఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి మరో 12 మంది ఎమ్మెల్యేలు?
ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతలందరూ కూడా కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఏకంగా కేసీఆర్ నమ్మిన నమ్మిన బంటు అని పేరు తెచ్చుకున్న నేతలు సైతం కాంగ్రెస్ పార్టీలోకి చేరుకోవడంతో ఇక అటు గులాబీ దళపతి కెసిఆర్ కు ఊహించని ఎదురు దెబ్బలు తగిలాయి అని చెప్పాలి. అయితే తాము గేట్లు ఎత్తివేస్తే టిఆర్ఎస్ పూర్తిగా ఖాళీ అవుతుందని గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ఇప్పుడు చెప్పింది నిజమే అవుతుందేమో అనే భావన ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే అందరికీ అర్థమవుతుంది. ఇకపోతే ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇప్పటికే పార్టీలోని కీలక నేతలందరూ కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుకోగా.. ఇక ఈరోజు తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ సభలో మరో 12 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం పార్టీ కండువా కప్పుకోబోతున్నారు అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. గంగుల కమలాకర్, కాలే యాదయ్య, తెల్లం వెంకట్రావు, అరికపూడి గాంధీ, కోవా లక్ష్మి, సుధీర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, మాణిక్ రావు, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, మాగుంట గోపీనాథ్, బండారు లక్ష్మారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారాన్ని బిఆర్ఎస్ కొట్టి పారిస్తుండగా.. ఏం జరుగుతుంది అన్నది కాంగ్రెస్ సభ ముగిసే వరకు ఉత్కంఠ నెలకొనే అవకాశం ఉంది.