సీఎం రేవంత్ సిట్టింగ్ స్థానంలోనే.. కాంగ్రెస్ కు దెబ్బపడేలా ఉందే?

praveen
తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలలో విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతుంది అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డికి ఒక ఎంపీ స్థానం మాత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. అదే మల్కాజ్గిరి. ఎందుకంటే ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ప్రస్తుతం రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా కూడా ఉన్నారు.

 ఇంకోవైపు ఇక మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని పార్టీలు సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటాయి. ఈ స్థానంలో విజయం సాధిస్తే రాష్ట్ర రాజకీయాల్లో పట్టు సాధించవచ్చు అని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తూ ఉంటారు. అలా ఈ ఎంపి స్థానంలో విజయం సాధించే.. రాష్ట్ర రాజకీయాలపై పట్టు సాధించి చివరికి అధికారాన్ని చేతికించుకున్నారు మల్కాజిగిరి ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్. 38 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో విజయం సాధించడం లక్ష్యంగా ప్రస్తుతం కాంగ్రెస్ వ్యూహాలను పన్నుతోంది.

 కానీ పరిస్థితులు చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరిలోనే కాంగ్రెస్కు దెబ్బ పడేలా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా రేవంత్ కొనసాగుతున్నప్పటికీ.. ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లోని ఏడు నియోజకవర్గాలలో బిఆర్ఎస్ విజయం సాధించింది. గత అసెంబ్లీ అన్ని చోట్ల కాంగ్రెస్ ప్రభంజనం సృష్టిస్తే.. ఇక మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ లోని ఏడు నియోజకవర్గాలలో మాత్రం బిఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. దీన్ని బట్టి చూస్తే ఈ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ కు మంచి పట్టు ఉంది. సొంత పార్టీ ఎంపీని గెలిపించుకునేందుకు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా పని చేస్తారు. ఇక ఇలాంటి పరిణామాలను బట్టి చూస్తే సీఎంకు సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరి లోనే.. కాంగ్రెస్కు దెబ్బ పడబోతుంది అని రాజకీయ విశ్లేషకులు అంచనా. మరి ఏం జరుగుతుంది అన్నది ఫైనల్ గా డిసైడ్ చేసేది ఓటర్లే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: