వైసీపీ: చేరే వారి కన్నా జారుకుంటున్న వారే ఎక్కువ?
ఆ తర్వాత ఏమైందో ఏమో తెలీదు కానీ రెండు రోజులుకే నోరు సవరించుకున్నారు.తను చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని..జగన్ మోహన్ రెడ్డి వల్లే తాను ఎమ్మెల్యే అయ్యాయని అన్నారు. ఇక, అప్పటి నుంచి వైసీపీకి, బాబుకు గ్యాప్ అనేది పెరిగిపోయింది. ఇక, వైసీపీ పూతలపట్టు అభ్యర్థిగా 2014లో ఇదే పార్టీ నుంచి గెలిచిన ఎం. సునీల్కుమార్కు ఇచ్చారు. ఈ పరిణామాలతో బాధపడిన బాబు.. వైసీపీ పార్టీకి పూర్తి దూరంగా ఉంటూ వచ్చారు. ఇక తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇలా చేరేవారి కన్నా.. జారుకుంటున్న వారే ఎక్కువగా ఉండడం వైసీపీకి ఇబ్బంది అవుతుంది. గడిచిన మూడు రోజుల్లో ముగ్గురు కీలక నాయకులు గుడ్ బై చెప్పారు. ఆ ముగ్గురూ కూడా జగన్ పదే పదే తాను తనతోనే కలుపుకున్న వర్గాలని చెబుతున్న సామాజిక వర్గాలకు చెందిన వారు కావడం గమనార్హం. వీళ్ళలో కిల్లి కృపారాణి(బీసీ-కళింగ), మహమ్మద్ ఇక్బాల్(మైనారిటీ ముస్లిం), ఎం.ఎస్ బాబు(ఎస్సీ-మాదిగ) ఉన్నారు.