ఎన్నికలు పెట్టిన చిచ్చు.. భార్యాభర్తలు విడిపోయారు?

praveen
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా పార్లమెంటు ఎన్నికల హడావిడి కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు కూడా ప్రచారంలో  దూసుకుపోతున్నారు.  తాము గెలిస్తే ఏం చేస్తామో చెబుతూ ఓటర్ మహాశయులను ఆకట్టుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఎన్నో చిత్ర విచిత్రాలు కూడా జరుగుతూ ఉన్నాయి  ఇలాంటి విషయాలు తరచూ సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.


  ఒకే కుటుంబం నుంచి ఎన్నికల్లో వివిధ పార్టీల తరఫున పోటీ చేస్తున్న ఇద్దరు కూడా చివరికి లోక్ సభ ఎన్నికల్లో ప్రత్యర్ధులుగా బరిలోకి దిగుతూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉండడం చూస్తూ ఉన్నాం. అయితే ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వార్త ఒకటి వైరల్ గా మారిపోయింది. ఏకంగా పార్లమెంట్ ఎన్నికలు భార్యాభర్తలిద్దరి మధ్య చిచ్చుపెట్టాయి. అదేంటి ఎన్నికలు అన్న తర్వాత ఆయా పార్టీల అభ్యర్థులు ఎన్నో హామీలు ఇస్తూ ఉంటారు. ఇక భార్యాభర్తలు ఎవరికి నచ్చిన వారికి వారు ఓటు వేస్తారు. దాంట్లో విడిపోవడానికి ఏముంది అనుకుంటున్నారు కదా.


 అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న భార్యాభర్తలు అందరిలా సాదాసీదా ఓటర్లు కాదు  ఎన్నికల్లో రెండు పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు. ఇలా మధ్యప్రదేశ్లో పార్లమెంట్ ఎన్నికలు భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టాయి. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుబా భర్త కంకర్ ముంజరే బిఎస్పి తరపున బాలాఘాట్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విభిన్న సిద్ధాంతాలు ఉన్న వ్యక్తులు ఒకచోట ఉంటే మ్యాచ్ ఫిక్సింగ్ గా ప్రజలు భావిస్తారని అనుకున్న కంకర్ ముంజరే ఇక ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు. ఏప్రిల్ 19వ తేదీన పోలింగ్ పూర్తయిన తర్వాతే మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తాను అంటూ ప్రకటించాడు. ఇక మరోవైపు అతని భార్య అనుభ బాలా ఘాట్లో కాంగ్రెస్ గెలుపుకు కృషి చేస్తాను అంటూ చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: