హైదరాబాద్ : ఓడిపోతామని తెలిసే.. బిజెపి ఆమెను నిలబెట్టిందా?
ఎప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగిన ఇక్కడ ఆ పార్టీకి చెందిన అభ్యర్థి ఏకపక్షంగా విజయం సాధించడం చూస్తూ ఉంటాం. దీంతో అధికారంలో ఏ పార్టీ ఉన్న ఇక ఎంఐఎం పార్టీతో స్నేహపూర్వక సంబంధం పెట్టుకుంటూ హైదరాబాద్లో కేవలం డమ్మీ అభ్యర్థిని మాత్రమే నిలబెడుతూ ఉంటాయి అని ఎప్పుడు ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఇది నిజమే అన్నట్లుగానే ఎన్నికల ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఇక ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి ఉన్న నేపథ్యంలో ఏకంగా బిజెపి సైతం ఇలాంటి డమ్మీ అభ్యర్థినే హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో బరిలోకి దింపిందా అనే చర్చ అక్కడక్కడా వినిపిస్తోంది.
హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్, ఆధ్యాత్మికవేత అయిన మాధవి లతను బరిలోకి దింపింది బిజెపి. అయితే మజిలీస్ కంచుకోటలో కాషాయ జెండా ఎగరవేయడం లక్ష్యంగా బిజెపి ఈమెను బరిలోకి దింపిందని అందరూ అనుకున్నారు. కానీ ఈమెకు టికెట్ ఇవ్వడం ఎవరికి ఇష్టమే లేదు అన్నట్లు హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని కీలక నేత రాజాసింగ్ సైలెంట్ అయిపోయారు. మిగతా నేతలు కూడా ఆమెకు సపోర్ట్ చేయడం లేదు. ఇంకోవైపు ఆమె గురించి హాస్పిటల్స్ పై ఎక్కువ బిల్లులు వసూలు చేస్తున్నారంటూ నెగటివ్ వస్తుంది. మరోవైపు ఆమెకు రాజకీయ అనుభవం కూడా తక్కువే. మంచి అనుభవం ఉన్న అభ్యర్థులే హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేసి గెలవలేకపోయారు . అలాంటిది బిజెపి ఓటమి ఎరుగని మజిలీస్ పార్టీని ఓడించేందుకు బలమైన అభ్యర్థిని కాకుండా రాజకీయ అనుభవం లేని మాధవి లతను బరిలోకి దింపారు అంటే కేవలం బిజెపి ఓడిపోతామని తెలిసినా ఆమెను నిలబెట్టింది అని ఒక టాక్ మాత్రం తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తోంది. అన్ని పార్టీల లాగానే బిజెపి హైదరాబాద్ అభ్యర్థి విషయంలో వ్యవహరించింది అంటూ అనుకుంటున్నారట జనాలు. అయితే ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం ఫలితాలు వచ్చిన తర్వాత అందరికీ అర్థమవుతుంది. ఇక మాధవి లత హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎన్ని ఓట్లు సంపాదిస్తారు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది.