' బోడే ' ఏపీ బీసీలకు బిగ్ ఐకాన్ అయ్యేనా ... బీసీల టాక్ ఇదే.. !
అయితే.. ఆ ఎన్నికల్లో ఓడిపోయినా.. బోడే గళం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వినిపించింది. అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. బీసీల హక్కుల కోసం పోరాటాలు చేశారు. ముఖ్యంగా వైసీపీ హయాంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలపైనా అక్రమాలపైనా ఆయన పోరాటాన్ని ముమ్మ రం చేశారు. సభలు సమావేశలు.. తన వ్యాఖ్యల ద్వారా.. బీసీల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే బోడే నేతృత్వంలో భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరిగింది.
బీసీవై పార్టీ తరఫున ఆయన గత రెండేళ్లుగా రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా చిత్తూరు జిల్లా లోని పుంగనూరు ఎమ్మెల్యే, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ రాజకీయాలు, దోపిడీ, హింస వం టి అనేక అంశాలను అజెండాగా తీసుకుని ముందుకు సాగారు. పుంగనూరులో నిత్యం రాజకీయ వేడి రగి లించారు. ప్రస్తుతం ఇదే నియోజకవర్గం నుంచి ఆయన బీసీవై పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కట్ చేస్తే.. బోడే గళానికి బీసీలు ఫిదా అయ్యారనేది వాస్తవం.
అయితే.. ఆయన మరింత కష్టపడితే.. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో బీసీల కోసం ఉద్యమించిన ఆర్ . కృష్ణ య్య తరహాలో బోడే కూడా మరింత ప్రజాదరణ, బీసీల ఆదరణ సొంతం చేసుకోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆర్. కృష్ణయ్య ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేస్తుండ డంతో ఆయన పేమ్ మసక బారిందనే చర్చ బీసీల్లోనే వినిపిస్తోంది. ఇలాంటి కీలక సమయంలో బోడే వంటియువ నాయకులు, విద్యావంతులు.. మరికొంత ఎఫర్ట్ పెడితే.. రాష్ట్రంలోనే ఆయన బీసీలకు ఐకాన్‌గా నిలవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.