నెల్లూరు : రసవత్తరంగా కోవూరు రాజకీయం.. ఈసారి గెలుపెవరిది..?

murali krishna
ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికల హడావుడి మొదలైంది.మే 13న రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని  నియోజకవర్గాలలో అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారం కూడా మొదలు పెట్టాయి..అయితే రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాలలో పోటీ హోరా హోరిగా సాగనుంది.అలాంటి వాటిలో నెల్లూరు జిల్లాలోని కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. ఇక్కడ టీడీపీ తరఫున వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బరిలో ఉన్నారు. మరోవైపు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి టీడీపీ తరఫున నెల్లూరు ఎంపీ గా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. 


ఇక వైసీపీ తరఫున కోవూరులో సిట్టింగ్‌ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.. గతంలో వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను వైసీపీ అధినేత జగన్‌ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ క్రమంలో నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కొందరు అసెంబ్లీ అభ్యర్థులను మార్చాలని వేమిరెడ్డి జగన్ ను కోరడం జరిగింది..వేమిరెడ్డి అభ్యర్ధనను జగన్‌ తిరస్కరించారు. దీంతో వేమిరెడ్డి టీడీపీలో చేరారు.టీడీపీ తరుపున నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు.


 అలాగే ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి కోవూరు నుంచి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాగా కోవూరులో ప్రస్తుతం వైసీపీ తరపునన పోటీ చేస్తున్న నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి గతంలో 1994, 1999లో టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే 2009 లో టీడీపీ తరఫున,2014,2019 వైసీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యే గా గెలుపొందారు.ప్రసన్నకుమార్‌ రెడ్డి మొత్తం మీద వివిధ పార్టీల తరఫున ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.అయితే ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త అయిన ప్రశాంతి రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు.టీడీపీలో ఆమె అన్నీ వర్గాలను కలుపుకొని విజయం సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు.అధికార పార్టీ మోసాలు, తప్పులు ప్రజలకు తెలియజేస్తూ నిత్యం జనంలో మమేకం అవుతున్నారు..ఇటు వైసీపీ తరపున ప్రసన్నకుమార్ రెడ్డి కూడా ప్రశాంతి రెడ్డి పై పలు ఆరోపణలు చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. దీనితో కోవూరు రాజకీయం రసవత్తరంగా మారింది. ఎవరు గెలుస్తారా అని ఇరు పార్టీల అభ్యర్థులపై బెట్టింగ్ కూడా జోరుగా సాగుతుంది. మరి ఈ ఇద్దరిలో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలీ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: