పల్నాడు : లోకల్ vs నాన్ లోకల్ గెలుపు గుర్రం ఎక్కేదెవరు..?
ఈ నియోజకవర్గం యొక్క గత పరిస్థితులు చూస్తే ఇటు కమ్మ సామాజికవర్గం నేతలు ఎంపీగా ఎన్నికయినా ఎక్కువ సార్లు రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలే పార్లమెంటు సభ్యులయ్యారు. వరసగా 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి రాయపాటి సాంబశివరావు, 2019లో వైసీపీ నుంచి లావు కృష్ణదేవరాయలు గెలిచారు. అయితే ఈసారి గెలుపు విషయంలో మాత్రం నాడి అందడం లేదనే చెప్పాలి.ఇద్దరికీ సమానమైన ఛాన్స్‌లు ఉన్నాయన్నది అంచనా.గతంలో నెల్లూరు నుంచి వచ్చిన నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డిలు కూడా ఇక్కడి నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అయితే ఇక్కడ రెడ్డి సామాజివకర్గంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువగా ఉన్నారు. కమ్మ సామాజికవర్గం ఓటర్లున్నప్పటికీ గెలిపించే స్థాయిలో మాత్రం లేరు. కానీ దీని పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో గురజాల, నరసారావుపేట, మాచర్ల నియోజకవర్గంలో ఫ్యాన్ గాలి బలంగా కనిపిస్తుంది. అదే సమయంలో చిలకలూరిపేట,పెదకూరపాడు, వినుకొండ, సత్తెనపల్లిలో టీడీపీ బలంగా ఉంది. ఈ పరిస్థితుల్లో పోటీ మాత్రం మామూలుగా లేదు. అందుకే నరసరావుపేటలో విజయం చివర వరకూ దోబూచులాడక తప్పదన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే చివరి వరకు గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి మరీ.