జగన్: గెలుపు కోసం చంఢీయాగం..!
ఆరిమాండ వరప్రసాద్ రెడ్డి, సురేష్ బాబు ఆధ్వర్యంలో కొంతమంది వేద పండితుల ద్వారా ఒక యాగం చేపట్టినట్టు తెలుస్తోంది. వెంకటాచలంపల్లి వద్ద సీఎం జగన్మోహన్ రెడ్డితో రాజా శ్యామల సహస్ర చండీయాగం చేయించారు.. ఆ తర్వాత అక్కడ వేద పండితులతో ఆశీర్వచనం అందించి 41 రోజులపాటు రాజశ్యామల సహస్ర చండీయాగం నిర్వహించే విధంగా నల్లపెద్ద శివరామ ప్రసాద్ వర్మ.. తదితరులు సైతం పాల్గొని.. వచ్చే ఎన్నికలలో సీఎం మరొకసారి జగన్మోహన్ రెడ్డి అయ్యేవిధంగా ఆకాంక్షిస్తూ ఈ యాగం చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ యాగాన్ని అక్కడ వేద పండితులు శివప్రసాద్ వర్మ నాగేంద్ర శర్మలు దగ్గరుండి మరీ చేయిస్తున్నట్లుగా సమాచారం.
అందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతున్నది. 2018 ఎన్నికలకు ముందు రాజశ్యామల యజ్ఞం చేశారు కెసిఆర్.. విశాఖపట్నంలో రాజశ్యామల అమ్మవారు ఉన్నారు కాబట్టి అక్కడ చేయించారు. దీంతో 2019లో ఆయన గెలిచారు. అయితే ఈమధ్య కూడా అదే యాగం చేసిన అధికారం దక్కలేదట. ఇక మరొకవైపు చూస్తే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇటీవలే రాజశ్యామల యాగం తన ఇంట్లోనే చేశారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి 2019లో రాజ శ్యామల యాగాన్ని చేశారు. దీంతో అధికారంలోకి వచ్చారు. మరి ఈసారి కూడా సీఎం జగన్ అవ్వాలని ఈ యాగం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇంతమంది అధినేతలు రాజ శ్యామల యాగం చేస్తున్న నేపథ్యంలో అమ్మవారు ఎవరిని అధిష్టానం లో కూర్చోబెడుతుందో చూడాలి.