ఏపీ: సొంతం గూటికి చేరడానికి రెడీ అయిన బీజేపీ నేత.. తేడా వస్తే దుకాణం బంద్..?
అయితే చక్రపాణి రెడ్డి తన వదినమ్మ సుజాతమ్మ టిడిపి పార్టీలో చేరి ఆలూరు నియోజకవర్గ నుంచే పార్టీ చేయడానికి సిద్ధమయ్యారని తెలిసి బీజేపీ నుంచి విరమించుకున్నారు. తన వదినకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. అయితే సుజాతమ్మ వైసీపీ పార్టీ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే వైసీపీకి బాగా ప్రజాదారణకు ఉందని గ్రహించిన చక్రపాణి రెడ్డి సంత గుడికి మళ్ళీ చేరాలని ఉవ్విళ్లూరుతున్నారు. 2019లో తన వదినమ్మ ఓడిపోయిన తర్వాత చక్రపాణి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు యాక్టివ్ గా మారెందుకు సిద్ధమయ్యారు.
ప్రస్తుతం పొలిటికల్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 12 నాడు ఈ నేత వైసీపీ పార్టీలో చేరనున్నారు. ఈ ఎన్నికల్లో ఈ నేత కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తారేమో అని చాలామంది భావించారు కానీ ఆయన అందరి అంచనాలను వమ్ము చేస్తూ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నారు. కప్పట్రాళ్ల బొజ్జమ్మ ఇటీవల వైకాపా నుంచి టీడీపీలోకి జంప్ చేశారు. ఆమె వెళ్లిపోయిన లోటును తీర్చేందుకు చక్రపాణి రెడ్డిని పార్టీలోకి వైసీపీ పెద్దలు ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. అతను పార్టీలో చేరగానే దేవనకొండ, ఆస్పరి మండలాలకు ఇన్చార్జి గా నియమించే అవకాశం ఉంది.