ఏపీ (మేనిఫెస్టో): దాగుడుమూతలాడుతున్న బాబూ..జగన్.. ప్రజలతో ఆటలా..?
ముఖ్యంగా ఈసారి ఎన్నికలలో ఇద్దరు పార్టీలకు కీలకమైనది మెనిఫెస్టోనే.. టిడిపి కూటమి మేనిఫెస్టోని విడుదల చేయబోగా.. వైసీపీ సోలో గానే మేనిఫెస్టోని విడుదల చేయబోతోంది. గత ఏడాది రాజమండ్రిలో నిర్వహించిన మహానాడులో చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను సైతం ప్రకటించారు. దసరాకి మేనిఫెస్టో అని చెప్పినప్పటికీ.. ఆ సమయంలో చంద్రబాబు జైలులో ఉండడం వల్ల ఆ తర్వాత పొత్తులు కుదరడం వల్ల చివరిలో అంతా కలిసి ఉమ్మడి మేనిఫెస్టోని తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు.
ఇక వైసిపి మేనిఫెస్టో ఉగాది వేళ జగన్ రిలీజ్ చేస్తారని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.. కానీ ఉగాది వెళ్లిపోయినప్పటికీ కూడా ఇంకా ఈ మేనిఫెస్టో విడుదల కాలేదు. అందుకు కారణం ఏమిటి అంటే టిడిపి మేనిఫెస్టో చూసిన తరువాతే వైసీపీ రిలీజ్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. టిడిపి సైతం వైసీపీ నే ముందు మేనిపోస్టు విడుదల చేస్తే ఒకవేళ ఆ హామీలన్నిటిని చూపించి రెట్టింపు హామీలతో తాము రిలీజ్ చేసి జనాలను ఆకట్టుకోవాలనే పనిలో టిడిపి ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.అందుకే టిడిపి మేనిఫెస్టో ఆలస్యం అవుతోందని సమాచారం.
అయితే టిడిపి, వైసిపి మేనిఫెస్టోలో కామన్ గా సామాజిక పెన్షన్ పెంపు.. రైతులకు రుణమాఫీ, డ్వాక్రామాఫీ వంటి అంశాలు ఉంటాయని సమాచారం.. అయితే టిడిపి మాత్రం రైతు భరోసాను రూ.20 వేలకు పెంచుతామని వెల్లడించారు. ఇలా పోటా పోటీగా ఎన్నికల ప్రణాళికలో హామీలను మేనిఫెస్టోలో పెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రజలు అయితే ఎవరి మేనిఫెస్టో ముందు రిలీజ్ అవుతుందని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కానీ మొత్తానికైతే మేనిఫెస్టో విషయంలో చంద్రబాబు ,జగన్ ఇద్దరూ కూడా దాగుడుమూతలు ఆడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాదు మేనిఫెస్టోని ప్రకటిస్తామని చెబుతూ.. అటు జగన్ ఇటు చంద్రబాబు ప్రజలతో ఆటలాడుతున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి..