కాంగ్రెస్ లో చేరిన కడియంకు.. ఇప్పుడు కొత్త చిక్కులు?

praveen
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తిరుగులేని పార్టీగా ఎదిగిన బిఆర్ఎస్ రెండుసార్లు అధికారాన్ని చేపట్టింది. అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని అనుకుంది. కానీ ఊహించని రీతిలో తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ కి షాక్ ఇచ్చారు  ఇలా గత అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటుకు గురైన బిఆర్ఎస్ కు ఇక ఇప్పుడు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆ పార్టీలోని కీలక నేతలందరూ కూడా కారును వదిలి కాంగ్రెస్ లోకి చేరుకుంటున్నారు.

 అయితే ఇలా కారు పార్టీలోని అందరూ నేతలు వెళ్లి కాంగ్రెస్లో చేరడం ఒకే ఎత్తు అయితే అటు బిఆర్ఎస్ పార్టీ రెండుసార్లు గెలిచిన సమయంలో డిప్యూటీ సీఎం సహా మరిన్ని కీలక పదవులు చేపట్టి.. కెసిఆర్ నమ్మిన బంటుగా ఆప్తుడిగా కొనసాగిన కడియం శ్రీహరి గులాబీ పార్టీని వదలడం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో సంచలనగా మారింది. ఇలా కడియం పార్టీ ఫిరాయింపు కెసిఆర్ కు కూడా వెన్నుపోటులా మారిపోయింది అని చెప్పాలి.  వరంగల్ టికెట్ ను కడియం కూతురు కావ్యకు ఇచ్చిన తర్వాత కూడా  పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్ లోకి వెళ్లడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

 ఇలా బిఆర్ఎస్ టిక్కెట్ను వదులుకొని మరి కాంగ్రెస్ లో చేరిన కడియం తమను వెన్నుపోటు పొడిచారని.. ఇది చేరదీసిన  పార్టీని నయవంచన చేయడమే అవుతుంది అంటూ బిఆర్ఎస్ లోని  నేతలందరూ కూడా కడియం పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిన కడియం కు కొత్త చిక్కు వచ్చి పడింది. ఎందుకంటే బిఆర్ఎస్ ఇప్పుడు కడియం పై కొత్త ఆరోపణలు మొదలుపెట్టింది. నా కూతురుని పోటీలో నిలబెట్టడానికి డబ్బులు లేవు అని చెబితే.. కేసీఆర్ కడియంకు 10 కోట్లు ఇచ్చారని.. ఆ పది కోట్లు తీసుకువెళ్లి ఇప్పుడు కాంగ్రెస్లో టికెట్ దక్కించుకొని అక్కడి నుంచి పోటీ చేస్తున్నారని.. బిఆర్ఎస్ నేతలు ఆలోపించగా.. ఇది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఇంకోవైపు బిజెపి కడియం కావ్య మతాంతర వివాహం చేసుకుంది. ఆమె హిందూ కాదు ముస్లిం అంటూ మరో విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఇంకో వైపు బిఆర్ఎస్ కడియం నమ్మక  ద్రోహం చేసారు ఓట్లు వేయొద్దు అనే విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తునడంతో కడియం క్రమక్రమంగా చిక్కుల్లో పడుతున్నారని అటు రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: