రాయి ఎటాక్: గురకలో జగన్ సెక్యూరిటీ..గులకరాయి దాడి.!

Pandrala Sravanthi
ఒకప్పుడు ప్రతి ప్రాంతానికి రాజు అనే వ్యక్తి ఉండేవారు. ఆయనకు సెక్యూరిటీగా బాటులు ఉండేవారు. అది అప్డేట్ అవుతూ పోలీస్ వ్యవస్థగా మారింది. ప్రస్తుతం ఈ పోలీస్ వ్యవస్థ  ప్రజలకు రక్షణ ఇస్తూనే,  ప్రజా ప్రతినిధులకు మరింత ప్రతిష్ట భద్రత కల్పించాలి. ప్రజా నాయకుడి పై చీమ  కూడా పారకుండా  చేయాలి. అలాంటి పోలీస్ వ్యవస్థ ఉన్న ఈ టైంలో  రాష్ట్ర సీఎంకు భద్రత లేకుండా పోయింది. ఎవరో అజ్ఞాత వ్యక్తి చిన్న గులకరాయితో సీఎంను కొట్టేంతవరకు వచ్చిందంటే ఆయన సెక్యూరిటీ ఎంత అలర్ట్ గా ఉందో అర్థం అవుతుంది. సీఎంకే భద్రతను ఇవ్వని ఆ పోలీస్ వ్యవస్థ  ప్రజలను ఏం కాపాడుతుంది.

ఒకవేళ పెద్ద ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారు. అనే విధంగా వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. తాజాగా జగన్  విజయవాడలోని సింగు నగర్ ప్రాంతంలో బస్సు యాత్ర చేస్తున్న టైంలో  ఎవరో గుర్తు తెలియని వ్యక్తి గులకరాయితో దాడి చేశారు. దీంతో జగన్ కనురెప్ప పై భాగంలో కాస్త దెబ్బ తగిలింది. దీంతో డాక్టర్లు ప్రథమ చికిత్స చేసి బ్యాండేజ్ వేశారు.  ఈ ఘటనపై పలు పార్టీల నుంచి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే  ఇదంతా తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులే చేపిస్తున్నారని, జగన్ పర్యటన సందర్భంలో కరెంటు తీసేసి మరి ఇలా చేశారని ఆరోపిస్తున్నారు. ఇక మరికొంతమంది ప్రత్యర్థులు  రాష్ట్ర సీఎంకే ఈ విధమైన భద్రత లేకుంటే ప్రజలకు ఏ విధమైన హామీ ఇస్తాడు అని విమర్శిస్తున్నారు.

ఇక ఇవన్నీ పక్కన పెడితే  రాష్ట్ర సీఎం పర్యటనకు వస్తున్నాడు అంటే తప్పనిసరిగా  ముందస్తుగానే సెక్యూరిటీ అలర్ట్ అవుతుంది. అందరికంటే ముందు  ఇంటిలిజెన్స్ విభాగం వారు ప్రజల్లో కలిసిపోయి ప్రజలు ఏమనుకుంటున్నారు, దాడి చేసే అవకాశం ఉందా అనే వివరాలను ఆరా తీస్తారు. అంతేకాకుండా స్పెషల్ పోర్స్ ,రోప్ పార్టీ ఉంటుంది . ఇంతమంది సెక్యూరిటీ ఉన్నా కానీ  ఆయనపై దాడి జరిగింది అంటే  సెక్యూరిటీ  అంతా గురకపెట్టి నిద్రపోతున్నారా అని  కొంతమంది సీనియర్ నాయకులు విమర్శిస్తున్నారు. అంత పెద్ద ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసి తప్పించుకున్నాడు అంటే ఈ ప్రభుత్వం వ్యవస్థ ఎంత చేతకానితనంలో ఉందో అర్థం చేసుకోవచ్చని  అంటున్నారు జగన్  రాజకీయ ప్రత్యర్థులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: