ఏపీ: భర్తల విజయం కోసం రంగంలోకి దిగిన భార్యలు.. !

Divya
ఎన్నో సందర్భాలలో భర్తల విజయం వెనుక భార్యలు కచ్చితంగా ఉంటారనే విషయాన్ని మనం వింటూనే ఉన్నాము.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో భర్తల విజయాన్ని కోరుతూ వారి యొక్క సతీమణులు కూడా రంగంలోకి దిగబోతున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి విజయాన్ని కోరుకుంటూ ఆయన భార్య వైయస్ భారతి రెడ్డి పులివెందులలో మఖాం వేశారు. పులివెందులలో జగన్ విజయం కోరుతూ ప్రచారం చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది వైయస్ భారతి. పులివెందులలో ఉంటూనే ఎన్నికలు పూర్తి అయ్యేవరకు జనంతో మమేకమయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

అలాగే మాజీ సీఎం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి కూడా తన భర్త విజయం కోసం చంద్రబాబు తరఫున కుప్పంలో పర్యటించి నామినేషన్ పత్రాలను కూడా దాఖలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలా ఎన్నికలు అయిపోయే వరకు నారా భువనేశ్వరి కుప్పంలోనే ఉండబోతున్నారు.

టిడిపి యువ నేత నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తున్నారు.. ఆయన విజయం కోసం భార్య నారా బ్రాహ్మణి కూడా మంగళగిరిలో ప్రచారం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన భర్త విజయం కోసం జనంలోనే ఉంటూ టిడిపికి అంతా అనుకూలమయ్యేలా చూసేలా నారా బ్రాహ్మణి  ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

హిందూపూర్ నుంచి బాలయ్య పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈసారి బాలకృష్ణ విజయం కోసం ఆయన భార్య వసుంధర కూడా హిందూపూర్ లో అడుగు పెట్టారు.. తన భర్త వెంటనే ఉంటూ బాలయ్య గెలుపు కోసం వసుంధర చాలా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి ఎన్నికలు చాలా రసవత్తంగా ఉంటున్న తరుణంలో ఖచ్చితంగా తమ భర్తల విజయాలను చూడాలనీ ఎవరికి వారు తాపత్రయ పడుతున్నారు. ఈసారి ఎన్నికలు మరింత హీట్ పుట్టించేలా కనిపిస్తున్నాయి. అటు టిడిపి , వైసిపి పార్టీ మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలా భర్తల కోసం భార్యలు ప్రచారం చేయడం ప్రత్యేకంగా అనిపిస్తోందంటూ పలువురు కార్యకర్తలు కూడా తెలియజేస్తున్నారు. మరి వీరి నలుగురిలో ఎవరు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: