ఏపీ: వైసీపీ పార్టీలో వరుసగా చేరుతున్న జనసేన ఇన్చార్జిలు.. పవన్ కళ్యాణ్ కి షాక్..??
ప్రజల అభిప్రాయాలను మార్చడం ఆవేశంతో కుదిరే పని కాదు. నిజానికి నాయకుడు సరిగా లేకపోతే కింద ఉన్న వారు తమ భవిష్యత్తు కోసం వేరే పార్టీలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. నాయకుడు ఆలోచనలు కింద వారికి కూడా ఉంటాయని అనుకోవడం పొరపాటు అవుతుంది. ఉదాహరణకి చిరంజీవిని తీసుకోవచ్చు ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. అయితే అందులోని పరకాల ప్రభాకర్ పార్టీ దెబ్బతినేలా మాట్లాడటం, అల్లు అరవింద్ సీట్ల కేటాయింపు విషయంలో స్వార్థంగా ప్రవర్తించడం వంటివి చిరంజీవి పార్టీని బాగా దెబ్బతీసాయి. పరకాల ప్రభాకర్ పార్టీని వీడు చేసిన కామెంట్లను తెలుగుదేశం మీడియా బాగా హైలైట్ చేయగలిగింది దీనివల్ల పార్టీలోనే అందరూ ప్రభావితమయ్యారు.
ప్రజలు కూడా ఈ పార్టీకి వేయకూడదని ఉద్దేశానికి వచ్చారు సో నెగటివ్ ప్రాపగాండాని చిరంజీవి అసలు ఆపలేకపోయారు. అయితే అన్న పార్టీని చూసి పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడ్డారు. జిల్లా ఇన్చార్జిలుగా ఎక్కువ మందిని తీసుకోకుండా ఒకరిని మాత్రమే పెట్టుకున్నారు తద్వారా పార్టీకి డ్యామేజ్ ఎక్కువగా లేకుండా చూసుకుంటున్నారు. అయినా కూడా చిరంజీవి ఆలోచనలు నచ్చక వేరే పార్టీలోకి వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతుంది.
తాజాగా అమలాపురం లోక్ సభ నియోజకవర్గ ఇన్‌ఛార్జీ డీఎంఆర్ శేఖర్ వైసీపీలోకి జంప్ చేశారు. గతంలో ఓఎన్జిసి అధికారి అయిన శేఖర్ కొద్ది నెలల సర్వీస్ ఉండగానే స్వచ్ఛందంగా పదవి విరమణ చేశారు. ఆపై జనసేన పార్టీలో చేరారు. 2019లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు కానీ ఓడిపోయారు. అమలాపురం జనసేన టికెట్ ఆశించిన శెట్టి వత్తుల రాజబాబు మాత్రం జనసేన లోపు చేరారు. జనసేన నేత మను క్రాంతి రెడ్డి కూడా వైయస్ జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలోకి వెళ్లిపోయారు. అలాగే మాజీ మేయర్ సరోజ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా జనసేన పార్టీలోని కీలక వ్యక్తులు వెళ్లిపోతూ ఉంటే పవన్ కళ్యాణ్ కి గెలిచే అవకాశాలు సన్నగిల్లే ప్రమాదం ఉంది. అందుకే ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది