జగన్‌ను వదులుకుని పవన్ చెంతకు... గెలవలేక అష్టకష్టాలు...?
వైసీపీ చేయించిన సర్వేలలో పాజిటివ్గా లేదని అందుకే సీటు ఇవ్వట్లేదని జగన్ చెప్పడంతో సదురు ఎమ్మెల్యే కండువా మార్చేసి పవన్ చెంత చేరిపోయారు. జనసేన కండువా వేసుకుని ... పైగా తన సొంత నియోజకవర్గ వదులుకొని మరో నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆ నేత ఎవరో కాదు చిత్తూరు సిటింగ్ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు. ఈయన 2019 ఎన్నికలలో వైసీపీ నుంచి పోటీ ఇచ్చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తాజా ఎన్నికలలో జగన్ శ్రీనివాసులు పక్కనపెట్టి తన సొంత సామాజి వర్గానికి చెందిన విజయానంద రెడ్డికి సీటు ఇచ్చారు.
దీంతో శ్రీని వాసులు కండువా మార్చేసి పవన్ చెంత చేరిపోయారు. పవన్ శ్రీనివాసులకు చిత్తూరు కాదని చెప్పి తిరుపతి సీటు ఇచ్చారు. ఇప్పుడు శ్రీనివాసులు తిరుపతి జనసేన క్యాండెట్ గా పోటీలో ఉన్నారు. అయితే నాన్ లోకల్ కావడంతో అక్కడ శ్రీనివాసులు ప్రచారంలోనే ఆపసోపాలు పడుతోన్న పరిస్థితి. అక్కడ ఆయన వైసీపీ నుంచి పోటీ చేస్తోన్న డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి పై పోటీ చేస్తున్నారు. మరి పార్టీ మారి.. నియోజకవర్గం మారి మరోసారి తన అదృష్టం పరీక్షించుకుంటోన్న శ్రీనివాసులు లక్ జనసేన లో ఎలా ? ఉంటుందో ? చూడాలి.