టీడీపి: లోకేష్ వల్లే పార్టీకి నష్టం కలుగుతోందా..?
ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎదుగుదలను కూడా అడ్డుకోవాలని ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారని రామ్మోహన్ ఎదుగుతుంటే లోకేష్ అసలు తట్టుకోలేక పోతున్నారని తెలిపారు. ఆ నాయకుడినే కాకుండా టిడిపి పార్టీలో కమ్మ కమ్యూనిటీలో ఎవరైనా స్ట్రాంగ్ లీడర్ గా ఎదిగారంటే లోకేష్ చంద్రబాబుకు చాలా భయం మొదలవుతుందంటూ విమర్శించారు. 2019లో పార్టీ ఓడిపోవడానికి ముఖ్య కారణం లోకేష్ తెలివి లేని నిర్ణయాలు ఆయన ఎత్తుగడలే కారణం అన్నట్టుగా ఆయన ఎద్దేవా చేశారు. టిడిపి పార్టీలో ప్రజాధరణ పొందిన నాయకులను చూస్తే అసలు ఈ తండ్రి కొడుకులు అసలు జీర్ణించుకోలేరంటూ వెల్లడించారు.
ఈ కారణం చేతనే ఎంతోమంది పార్టీని కూడా వీడారంటూ తెలియజేశారు. గతంలో సృజనా చౌదరి కూడా టిడిపి పార్టీని వీరడానికి ముఖ్య కారణం లోకేష్ అంటూ పలు సంచలన ఆరోపణలు చేశారు కేశినేని నాని.విజయవాడ అభివృద్ధిని కోరుకునే వారు తప్పకుండా తమను గెలిపించాలంటూ కేశినేని నాని తెలియజేశారు. అక్రమాలు చేసే వారికి అడ్డుగానే ఉంటానని తను మొదటి నుంచి ఇలాంటి విషయాలను వ్యతిరేకించానని .. అందుకు లోకేష్ తనకు ఈ విషయం నచ్చక ఇబ్బందులు పెడుతూ ఉంటే పార్టీని వీడానని కూడా తెలియజేశారు. మొత్తానికి లోకేష్ పైన కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి కలిగించేలా చేస్తున్నాయి. గతంలో కూడా లోకేష్ పైన టిడిపి నేతలు చాలామంది విమర్శించారు.