ఆంధ్రప్రదేశ్ లో కులాల లెక్కలు ఎలావున్నాయంటే..?

murali krishna
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఎన్నికల జోరు కొనసాగుతుంది .నామినేషన్ల చివర తేదీ కూడా ముగియడం తో ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకున్నట్లు అయింది .దీనితో నామినేషన్ వేసిన అభ్యర్థులు ప్రచారం లో మరింత జోరు పెంచుతున్నారు .నియోజకవర్గం వారీగా అభ్యర్థులు ప్రతి గడపకు వెళ్లి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు.రాష్ట్రం లో మరోసారి ఎలాగైనా భారీగా సీట్లు సాధించి అధికారం చేపట్టాలని వైసీపీ అధినేత జోరు గా ప్రచారం చేస్తున్నారు.అలాగే వైసీపీ  పార్టీ నాయకులూ కార్యకర్తలు ఈ ఐదేళ్ల లో ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పధకాలను వివరిస్తున్నారు.అలాగే ప్రతి పక్ష కూటమి నాయకులూ ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయాలను,మోసాలను ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్తున్నారు.వైసీపీ పార్టీని గద్దె దించేలా జోరుగా ప్రచారం చేస్తున్నారు.

తాము అధికారం లోకి రాగానే చేసే కార్యక్రమాలను సంక్షేమ పధకాలను ప్రజలకు వివరిస్తున్నారు .దీనితో రాష్ట్రం లో రాజకీయం రసవత్తరంగా మారింది.త్వరలోనే ఇరు పార్టీ నాయకులూ తమ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు.మేనిఫెస్టో ద్వారా ప్రజలకు అందించబోయే పధకాలను తెలియజేయనున్నారు.అధికార వైసీపీ పార్టీ ఈసారి మేనిఫెస్టో లో పలు కీలక అంశాలను చేర్చనున్నట్లు సమాచారం..పాత పధకాలను కొనసాగిస్తూనే మరిన్ని కొత్త పధకాలను ప్రవేశపెట్టనున్నారు.అలాగే కూటమి ఇప్పటికే 6  గ్యారెంటీలు ప్రకటించగా త్వరలోనే పూర్తి మేనిఫెస్టో ను ప్రకటించనుంది. ఎన్నికలలో గెలిచేందుకు రాజకీయ నాయకులూ కులాల వారీగా జాబితా సిద్ధం చేస్తున్నారు .కులాల వారీగా తమ పార్టీకి ఎన్ని ఓట్లు రావొచ్చు అని లెక్కలు వేసుకుంటున్నారు.రాష్ట్రం లో కులాల వారీగా లెక్కలు ఇలా వున్నాయి .కాపులు బలిజలు —-52,07,091,ఎస్సి మాల —35.46,748,రెడ్డి—26,69,029,మాదిగ —25,85,725, యాదవ —--25,54,037, ముస్లిం –23,84,492, కమ్మ —19,87,911, ఉత్తరాంధ్ర కాపులు —15,18,044, వైశ్యులు —13,41,478, బోయ,  వాల్మీకి —9,69,468.మత్స్యకారులు–15,74,865,పద్మశాలిలు —9,64,351, 
రజకులు —-8,41,457,బ్రాహ్మణులూ —--7,31,655, వడ్డెరులు –5,54,655, నాయి బ్రాహ్మణులు—4,15,520,క్షత్రియులు —--4,15,579, క్రిస్టియన్స్ —3,15,320,యానాదులు —-3,09,193

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: