సినీ గ్లామర్ : ఎన్నికల ప్రచారంలో వారి విక్టరీ కోసం 'విక్టరీ'..?

FARMANULLA SHAIK
ఇండస్ట్రీలో ఎటువంటి కాంట్రవర్సీ లేని హీరో అంటే వెంకటేష్. ఆయన పని ఏదో ఆయన చూసుకొని, ఏ వివాదాల్లో వేలు పెట్టకుండా చాలా సైలెంట్ లైఫ్ ని రన్ చేస్తుంటారు. అలాంటి హీరో ఏపీ వంటి రాజకీయాల్లో భాగం అవుతుండడం.. అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.తె లుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ కొనసాగుతుంది.అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం భాగం అవుతున్నారు. ఇప్పటికే జనసేన తరఫున హైపర్ ఆది, డాన్స్ మాస్టర్స్, టీవీ యాక్టర్స్ రంగంలోకి ప్రచారం చేస్తున్నారు.మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ కి సపోర్ట్ తెలియజేస్తూ ఇటీవల సీఎం రమేష్,పంచకర్ల రమేష్ ని గెలిపించాలంటూ ప్రజలను కోరారు. హీరో నిఖిల్ కూడా తన బంధువైన చీరాల టీడీపీ అభ్యర్థి కొండయ్య తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. హీరో వరుణ్ తేజ్ కూడా తన బాబాయి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పిఠాపురంలో ప్రచారం నిర్వహించనున్నారు.

 అయితే ఇప్పుడు స్టార్ హీరో వెంకటేష్ కూడా ఎన్నికల ప్రచారానికి సిద్దమైనట్టుగా తెలుస్తోంది. వెంకటేష్‌ గతంలో ఎప్పుడు రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడింది లేదు. తన సినిమా ప్రమోషన్స్‌, ఏదైనా ఫంక్షన్స్‌కు తప్పితే వెంకటేష్‌ బయట కూడా చాలా అరుదుగా కనిపిస్తుంటారు.వెంకటేష్ మాత్రం తన బంధువుల కోసం మద్దతుగా ఎన్నికల ప్రచారానికి సిద్దమైనట్టుగా తెలుస్తోంది.ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం ఎంపీ బరిలో కాంగ్రెస్ నుంచి రామసహాయం రఘురాంరెడ్డి పోటీలో నిలబడ్డారు. ఆయన వెంకటేష్‌కు వియ్యంకుడు. రఘురాంరెడ్డి పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డికి హీరో వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రితతో వివాహం జరిగింది. ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన వియ్యంకుడి కోసం ఒక్క రోజు ప్రచారం చేయడానికి రెడీ అయినట్టుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్డీయే కూటమి తరఫున పోటీ చేస్తున్న కామినేని శ్రీనివాస్ కూడా వెంకటేష్‌కు బంధువు అవుతారు.వెంకటేష్ భార్య నీరజకు కామినేని శ్రీనివాస్ స్వయానా మేనమామ. దీంతో కామినేని శ్రీనివాస్ తరఫున ప్రచారం చేసేందుకు వెంకటేష్ సిద్దమైనట్టుగా తెలుస్తోంది. కైకలూరు నియోజకవర్గంలో వెంకటేష్ రోడ్ షో చేసే ప్లాన్ చేయనున్నట్టుగా సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: