చీపురుపల్లి:మంత్రి పదవి సెంటిమెంట్ ఈసారి ఎవరిని వరిస్తుందో..?

Pandrala Sravanthi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇక్కడి నుంచి గెలిచిన చాలామంది నేతలు  కేంద్ర రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సాధించారు. అలాంటి విజయనగరంలోని  చీపురుపల్లి నియోజకవర్గం ని చాలామంది సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి గెలిచిన ఏ నేత అయినా సరే  క్యాబినెట్ పదవి తెచ్చుకోవడం ఎప్పటినుంచో వస్తోంది. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో గెలిచిన పార్టీ తప్పనిసరిగా అధికారంలో ఉంటుంది. ఈసారి ఆ సెంటిమెంట్ ఎవరిని వరిస్తుంది. ఈసారి గెలిచే అభ్యర్థి మంత్రి పదవి చేపడతారా..? పూర్తి వివరాలు ఏంటో చూద్దాం.. చీపురుపల్లి నియోజకవర్గంలో 1978 నుంచి మొదలు కొన్ని పర్యాయాలు  కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల తరఫున  గెలిచినటువంటి ఎంతో మంది నాయకులు ఉన్నతమైన పదవులను పొందారు.  తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన  చిగాలపల్లి శ్యామలరావు మొదటిసారి మంత్రి పదవి చేపట్టారు.

 ఇక అప్పటినుంచి రాజకీయంగా చీపురుపల్లి మంత్రి పదవి సెంటిమెంట్ గా వస్తోంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చీపురుపల్లి నుంచి గెలిచినటువంటి త్రిపురాణ వెంకటరత్నం కూడా మంత్రివర్గంలోకి వచ్చారు. అలాగే 94, 99 లో గెలిచినటువంటి టిడిపి అభ్యర్థి గద్దె బాబురావుకు మంత్రి పదవి దక్కకపోయినా ప్రభుత్వ విప్ పదవి దక్కింది. అలాగే 2004 లో బొత్స సత్యనారాయణ అరంగేట్రం చేసిన తర్వాత  ఆయనకు రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రి పదవి దక్కింది.  ఆ తర్వాత 2009లో రెండోసారి గెలిచి ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మరోసారి మంత్రి అయ్యారు. ఇక ఎంతో పట్టున్నటువంటి బొత్స సత్యనారాయణను  2014లో తెలుగుదేశం పార్టీ కిమిడి మృణాళిని  ఓడించింది. ఆమెకు కూడా చంద్రబాబు మంత్రివర్గంలో పదవి దక్కింది.. ఈ విధంగా  నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే గెలిస్తే రాష్ట్రంలో కూడా ఆ పార్టీ అధికారంలో ఉంటుంది.  ఇక్కడ గెలిచిన అభ్యర్థికి తప్పక మంత్రి పదవి కూడా దక్కుతుంది. ఈ సెంటిమెంటు గత కొన్ని పర్యాయాల నుంచి కొనసాగుతూ వస్తోంది.

ఈసారి ఆ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా లేదా అని చాలామంది ఆలోచిస్తున్నారు. ఈ ఎన్నికల్లో  చీపురుపల్లి  వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ బరిలో ఉండగా, టిడిపి కూటమి నుంచి కిమిడి కళా వెంకట్రావు బరిలో ఉన్నారు. ఈ ఇద్దరు ఎంతో సీనియర్ నేతలు. మంత్రి పదవులు చేపట్టిన అనుభవం కూడా ఉంది. ఇదే తరుణంలో చీపురుపల్లిలో హోరాహోరీ పోరు జరుగుతుంది. అయితే నిజానికి చీపురుపల్లిలో  బొత్స సత్యనారాయణకు ఎక్కువగా గ్రిప్ ఉంది. ఆయనకు రాజకీయాలకు అతీతంగా 43 వేలకు పైగా ఓటర్ అభిమానులు ఉన్నారు. అంతేకాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో కాస్త హైప్ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. కళా వెంకట్రావు కొత్త వ్యక్తి కావడంతో నియోజకవర్గ పరిస్థితులు ఆయనకు అర్థం అవడం లేదట. అయినా ఆయన నియోజకవర్గమంతా తిరుగుతూ ప్రజలకు భరోసా కల్పిస్తూ ఈసారి టిడిపి ప్రభుత్వం రాబోతోందని, నియోజకవర్గాన్ని తప్పక   అభివృద్ధి చేసుకుందామని హామీ ఇస్తున్నారట. ఈ విధంగా చీపురుపల్లిలో ఇద్దరు సీనియర్లు హోరాహోరీగా తలపడుతున్నారు. ఇద్దరిలో ఎవరు గెలుస్తారు. ఎవరికి మంత్రి పదవి వరిస్తుంది అనేది తెలియాలంటే పోలింగ్ జరిగి రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: