బొబ్బిలి యుద్ధం: రాజుల ఆధిప‌త్యం ఉంటుందా.. జ‌గ‌న్ ప్లాన్ స‌క్సెస్ అవుతుందా ?

RAMAKRISHNA S.S.
తెలుగుదేశం పార్టీకి పెద్దగా కలసి రాని అసెంబ్లీ నియోజకవర్గాలు ఏపీలో చాలానే ఉన్నాయి. అస‌లు గ‌త 20 ఏళ్ల‌లో తెలుగుదేశం గెల‌వ‌ని సీట్ల‌కు కొద‌వే లేదు. ఇలాంటివి రాయ‌ల‌సీమ‌లోనే కాదు.. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సైతం ఉన్నాయి. అటు ఉత్త‌రాంధ్ర‌లోనూ కొన్ని సీట్ల‌లో టీడీపీ 25 ఏళ్లుగా విజ‌యం సాధించ లేదు అంటే అర్థం చేసుకోవ‌చ్చు. అలాంటి సీట్ల‌లో విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని బొబ్బిలి ఒకటి. ఈ సీటు ఎప్పుడూ కాంగ్రెస్ కే జై కొడుతూ వచ్చింద‌నే చెప్పాలి. అలాంటి సీటులో గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ వైసీపీ విజ‌యం సాధించింది.

ఇక 1983లో తెలుగుదేశం పార్టీ పుట్టాక జ‌రిగిన తొలి ఎన్నిక‌ల్లో బొబ్బిలి కోట‌పై ప‌సుపు పార్టీ జెండా ఎగిరింది. ఇక 1985లోనూ రెండోసారి వ‌రుస‌గా తెలుగుదేశం విజ‌యం సాధించింది. ఇక 1989లో మాత్రం ఓడిపోయిన టీడీపీ 1994లో టీడీపీ మూడోసారి గెలిచింది. ఈ మూడు సార్లు కూడా టీడీపీ త‌ర‌పున ప్ర‌స్తుత వైసీపీ క్యాండెట్ గా ఉన్న శంభంగి చిన్న అప్ప‌ల‌నాయుడు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే అప్ప‌టి వ‌ర‌కు మ‌ద్రాస్‌లో వ్యాపారాలు చేసుకునే బొబ్బిలి రాజులు ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ నుంచి 1999లో త‌మ అనుచ‌రుడిగా పెద్దంటి జ‌గ‌న్మోహ‌న్ రావును నిల‌బెట్టి గెలిపించారు.

ఆ త‌ర్వాత బొబ్బిలి రాజులు 2004 ఎన్నిక‌ల్లో ఫ‌స్ట్ టైం రాజ‌కీయాల్లోకి వ‌చ్చి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు అయ్యారు. సుజ‌య్ కృష్ణ రంగారావు 2004, 2009లో కాంగ్రెస్ నుంచి 2014లో వైసీపీ నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. గ‌త ఎన్నిక‌ల్లో మాత్రం టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈ సారి సుజ‌య్ కృష్ణ‌ పోటీ నుంచి త‌ప్పుకుని త‌న సోద‌రుడు బేబీ నాయ‌న‌కు సీటు ఇప్పించారు. బేబీ నాయ‌న మాస్ లీడ‌ర్‌. జ‌నాల్లోకి బాగా దూసుకు పోతున్నారు.

బేబీ నాయన గత అయిదేళ్ల పాటు బొబ్బిలిని అట్టిపెట్టుకొని పనిచేస్తూ వస్తున్నారు. గ‌త మూడు దశాబ్దాలుగా అయిదు ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ ఇక్క‌డ గెలిస్తే అది ఖ‌చ్చితంగా బొబ్బిలి రాజుల క్రెడిట్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: