తెలంగాణ: పాపం ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం దేవులాడుతున్న బీఆర్ఎస్?
అందులోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా వల్ల వచ్చిన ఉపఎన్నిక కావడంతో వారికి ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. అందుకే గెలవడం అయితే వారికి తప్పనిసరి. కానీ ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. ఇప్పుడు అక్కడ అభ్యర్థిగా ఎవరిని దింపాలన్నది సమస్యగా మారింది. ఎవరూ పోటీకి ముందుకు రావడం లేదని గుసగుసలు వినబడుతున్నాయి. ప్రచార గడువు కూడా లేదు. మే రెండోతేదీ నుంచి నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. కాగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ 13వ తేదీన జరుగుతుందనే విషయం అందరికీ తెలిసినదే.
వారు గనక అక్కడ అభ్యర్థిని నిలబెడితే గెలవాలి, లేదంటే కనీసం రెండో స్థానంలో ఉండాలి. అంతేగాని కనీస ఓట్లు కూడా రాకపోతే మాత్రం పరువు పోతుంది. ఓ రకంగా బీఆర్ఎస్ పార్టీ ఉనికికే పెద్ద సమస్య వస్తుంది. అవును, ఇప్పుడు బీఆర్ఎస్ ది అదే పరిస్థితి. పోటీ చేస్తే కనీస ఓట్లు వస్తాయన్న నమ్మకం కూడా పార్టీలో లేదని గుసగుసలు వినబడుతున్నాయి. పోనీ పోటీ చేయకపోతే పారిపోయారని అంటారు. ఏం చేయాలన్నది వారం రోజుల్లో డిసైడ్ చేసుకునే అవకాశం ఉంది, అయితే ఈలోగా పుణ్యకాలం గడిచిపోకుండా ఏం చేస్తారో చూడాలి మరి!