పేరుకే బీసీలు తెరవెనుక కమ్మ వర్సెస్ రెడ్డి.. పెనుగొండలో విజేత ఆ అభ్యర్థేనా?
పెనుగొండలో పైకి బీసీ మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నా తెరవెనుక మాత్రం కమ్మ వర్సెస్ రెడ్డి రాజకీయాలు జరుగుతున్నాయి. రెడ్డి సామాజికవర్గానికి చెందిన వాళ్లు ushashri CHARAN' target='_blank' title='ఉషశ్రీ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఉషశ్రీ చరణ్ కు మద్దతు ఇస్తుండగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్లు మాత్రం సవితమ్మకు మద్దతు ఇస్తున్నారు. రాయలసీమలో కమ్మ సామాజికవర్గంతో పోల్చి చూస్తే రెడ్డి సామాజికవర్గం జనాభా ఎక్కువ కావడంతో ushashri CHARAN' target='_blank' title='ఉషశ్రీ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఉషశ్రీ చరణ్ కే అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
పెనుగొండ నియోజకవర్గంలో ఏ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయో తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందేనని చెప్పవచ్చు. అయితే ప్రచారం విషయంలో మాత్రం అటు సవితమ్మ కానీ ఇటు ushashri CHARAN' target='_blank' title='ఉషశ్రీ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఉషశ్రీ చరణ్ కానీ ఎవరూ తగ్గడం లేదు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఇద్దరు నేతలు భారీ స్థాయిలో ఖర్చు చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం అందుతోంది. పెనుగొండ ఫలితాల గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.
ఉమ్మడి అనంతపూర్ లోని మెజారిటీ స్థానాలలో కూటమి విజయం సాధిస్తుందని బాబు నమ్ముతుండగా సర్వేల ఫలితాలు మాత్రం వైసీపీకే అనుకూలంగా ఉన్నాయి. హిందూపురం, ఉరవకొండ, శింగనమల నియోజకవర్గాల్లో మాత్రం కూటమి విజయం సాధించే ఛాన్స్ అయితే ఉంది. టీడీపీ మేనిఫెస్టో విడుదలైన తర్వాత ఏపీలో ఏ పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయో పూర్తిస్థాయిలో క్లారిటీ రానుంది.