గాజు గ్లాస్ పగిలి ఇప్పుడు కూటమికి బాగా గుచ్చుకుంటుంది. తెలుగుదేశం కూటమిలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. తాము కామన్ సింబల్ గా చేయమని చెబితే ఇలా ఫ్రీ సింబల్ చేశారని
జనసేన మండిపడుతోంది. దీని మీద ఆ
పార్టీ కోర్టుకు కూడా వెళ్ళింది. నిజానికి ఈ విషయంలో
జనసేన పార్టీ చాలా సీరియస్ గానే ఉంది. గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తూ రిటర్నింగ్ అధికారులు తీసుకున్న నిర్ణయం పై
జనసేన పార్టీ న్యాయ స్థానాలలోనే తేల్చుకోవాలని చూస్తోంది. అందుకే
జనసేన నేరుగా హైకోర్టును ఆశ్రయించింది.తమ
పార్టీ మొత్తం కూడా 175 సీట్లలో పోటీకి పెట్టగలిగే సత్తా ఉన్నా తాము
టీడీపీ కూటమితో పొత్తులో ఉన్నందు వలనే కొన్ని స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్నామని కోర్టు దృష్టికి
జనసేన పార్టీ తీసుకుని వచ్చింది. ఆ విధంగా పొత్తులనేవి ఉండడం వల్లనే తాము మొత్తం 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడం లేదని వివరించింది.అయితే తాము పోటీలో లేకపోతే తమ గుర్తుని కాస్తా ఫ్రీ సింబల్ అని చెప్పి
జనసేన పోటీ చేయని మిగిలిన స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజుగ్లాసు గుర్తును కేటాయించడం ఏమిటని ఆ
పార్టీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొంది.
ఈసీ తీసుకున్న ఈ డెసిషన్ మీద
జనసేన పార్టీ న్యాయపరంగా సవాల్ చేసింది.ఇంకా అదే విధంగా ఈసారి ఎన్నికల్లో తాము రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో, 21
అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్నామని కూడా కోర్టుకు
జనసేన వివరించింది. అందువల్ల తాము మిగిలిన చోట పొత్తులో ఉన్న బీజేపీ,
టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ఉన్నామని
జనసేన పేర్కొంది.ఈ విషయం ఇంత క్లారిటీగా ఉంటే ఫ్రీ సింబల్ పేరుతో స్వతంత్ర అభ్యర్థులకు ఎలా కేటాయిస్తారని కోర్టు ద్వారా ఈసీని
జనసేన ప్రశ్నించింది.దీంతో ఈ విషయం మీద ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. దీనిపై ఎన్నికల కమిషన్ ని వివరణ కోరినట్లుగా సమాచారం తెలుస్తోంది.దీంతో
ఈసీ 24 గంటలలో ఈ విషయం పై నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఇక
ఈసీ ఇప్పుడు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అన్నది చర్చకు వస్తోంది.