ఏపీ: పిఠాపురంలో సీన్ రివర్స్... తాజా నివేదిక తేటతెల్లం చేసిందిగా?
ఈసారి ఖచ్చితంగా గెలిచి చట్ట సభల్లో అడుగు పెట్టాలని పవన్ కల్యాణ్ విశ్వ ప్రయత్నాలే చేస్తున్నారు. కాగా అక్కడ ఆయన గెలుపు అంత సులువు కాదనే అనుమానాన్ని కొందరు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు అధికార పార్టీ నుంచి వంగా గీత బరిలోకి దిగుతున్నారు. ఆమె ప్రస్తుతం కాకినాడ ఎంపీగా కొనసాగుతున్న విషయం విదితమే. గతంలో ఆమె పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. స్థానికురాలు కావడం కూడా ఇపుడు వంగా గీతకు అక్కడ ప్లస్ పాయింట్‌గా కనిపిస్తోందని విశ్లేషణలు కనబడుతున్నాయి. ఇక పవన్ కల్యాణ్ గెలుపు అక్కడ టీడీపీ నేత వర్మ మీద ఆధారపడి ఉంది అనడంలో పెద్ద వింతేమీ లేదు.
ఎందుకంటే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ డైరెక్టుగా ఒప్పుకోవడం అందరికీ తెలిసిందే. అయితే అదే వ్యక్తిగత చరిష్మాకు మైనస్‌గా మారింది. పిఠాపురంలో మొత్తం 90000 దాకా కాపులు ఉంటే యూత్ ఓట్లు దాదాపుగా పవన్‌కే పడే అవకాశం లేకపోలేదు. ఇక పెద్ద వాళ్ల ఓట్లు మాత్రం కచ్చితంగా వంగా గీతకే అని స్పష్టంగా తెలుస్తోంది. ఇలా కాపుల ఓట్లలో వయోభేదంతో పెద్ద చీలిక ఏర్పడడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. మిగిలిన కులాలలో ఎస్సీలు, బీసీలు మైనారిటీలలో మాత్రం అధిక శాతం ఓట్లు తమకే పడతాయని వైసీపీ మరోవైపు కలలు కంటోంది. అదే నిజం కూడా. దీంతో పిఠాపురంలో వైసీపీ గెలుపు గురించి కాకుండా మెజార్టీపై గురి ఏర్పడింది ఇపుడు. ఎటు చూసిన కూడా గెలుపుపై అధికార వైసీపీ ధీమాగానే కనిపిస్తోంది. ప్రస్తుతానికి అయితే పిఠాపురంలో వైసీపీకే కాస్తా ఎడ్జ్ కనిపిస్తోందని అంచనా!