ఏపీ: గెలవాలంటే డబ్బులు పంచాల్సిందేనా..?

Divya
ఎన్నికల సమయం ప్రారంభమైందంటే చాలు  ఆయా నియోజకవర్గాలలో డబ్బులు పంచడానికి నేతలు సిద్ధమవుతూ ఉంటారు. అందుకు తగ్గ ప్రణాళికను కూడా ముందస్తుగానే చేసుకొని మరి వెళ్తూ ఉంటారు నేతలు. తెలిసినటువంటి వారు బాగా నమ్మినటువంటి వారిని ఇలాంటి సమయంలో ఎంచుకుంటూ ఉంటారు నేతలు.  గత ఎన్నికలలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా.. కొన్నిచోట్ల అపార్ట్మెంట్లు కొద్దిరోజులు రెంటుకు తీసుకొని కబోర్డులు ఎక్కువగా ఉండేటువంటి వాటిని తీసుకొని అందులో డబ్బులు పెట్టేవారని సమాచారం.

ఇక ఆ ఇంట్లో ఎవరైనా బాగా తెలిసిన వ్యక్తిని ఉంచేవారట. ఇట్లాంటి ఏర్పాట్లతో ప్రజలకు డబ్బును పనిచేయవారట. ఇప్పుడు వచ్చేసరికి అలాగే జరుగుతోందనుకున్నాము.. కానీ నిన్నటి రోజున అనంతపురం జిల్లాలోని  కదిరిలో రెండు కోట్ల రూపాయల డబ్బు దొరకడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. సుమోలో నుంచి డబ్బులు తీసుకొని వెళుతూ ఉండగా పట్టుకున్నట్లు తెలుస్తోంది. గతంలో మాద్రి కార్యకర్తల మీద, నాయకుల మీద, లేకపోతే లోకల్ వ్యాపారూల మీద నమ్మకం లేకుండా ఉండాలి..

లేదా అధికార యంత్రాలు పట్టుకుంటున్నారని గతంలో లాగా లేదు.. అనే ధైర్యం చేసి ఉండాలి.. మొత్తం మీద చిక్కినట్లు అయితే ఈడి కేసులు వారంటీలు మొత్తం ఈసీ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అలాగే ఇన్కమ్ టాక్స్ సిబిఐ వారి చుట్టూ కూడా తిరగాల్సి ఉంటుందట. ఈ దరిద్రమంతా ఎందుకని చాలామంది దగ్గర డబ్బుని  పెట్టుకోలేదు.. అందుకే ఎక్కువ డబ్బు ఉండే వారి దగ్గర పెట్టడం వల్ల కాస్త సేఫ్ గా ఉంటుందని ఆలోచిస్తూ ఉంటారు నాయకులు. అయితే కదిరిలో చిక్కినటువంటి డబ్బు ఇలాంటి వారి దగ్గర పెట్టిన ఎందుకో వీరు ధైర్యం చేయలేకపోయారట. అందుకే క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తున్న సమయంలో చిక్కినట్టుగా తెలుస్తోంది. వైసిపి పార్టీ వాళ్లు అధికారం ఉంది కాబట్టి ముందుగానే ఈ విషయంలో సేఫ్ జోన్ లో ఉన్నట్టుగా సమాచారం.. అయితే డబ్బులు ఎవరు పంచకుండానే ఓట్లు వేస్తారు అంటే అది నమ్మడం అసాధ్యమే.. ఓట్ల కోసం అందరూ కూడా డబ్బులు పంచుతారు తీసుకోవడం తీసుకోకపోవడం అనేది ప్రజల యొక్క భావన మీదే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: