కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ్లొద్దు... ఒక్క సారిగా షాక్ ఇచ్చిన ఎన్నిక‌ల క‌మిష‌న్‌..?

Divya
ప్రస్తుతం ఎన్నికల హడావిడి చాలా రాష్ట్రాలలో కనిపిస్తోంది.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన ప్రచారాలతో నేతలు నువ్వా నేనా అనెంతగా  ముందుకు సాగుతున్నారు. తాజాగా తెలంగాణలో టిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల కమిషనర్ ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా ఆయన ఎన్నికల ప్రచారంపైన నిషేధం విధించాలంటూ కూడా తెలియజేసినట్లు తెలుస్తోంది. ఈరోజు రాత్రి 8 గంటల నుంచి దాదాపుగా 48 గంటల పాటు ఆయన ప్రచారం నిషేదించాలంటు ఈసి అధికారులు తెలియజేస్తున్నారు. అందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

కెసిఆర్ పైన కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. కేసీఆర్ ఎన్నికల ప్రచారం పైన 48 గంటల పాటు నిషేధించబడినట్లుగా ఈ రోజు రాత్రి 8 గంటల సమయం నుంచి 3వ తేదీ రాత్రి 8 గంటల వరకు ఎలాంటి ప్రచారాలను కూడా నిర్వహించవద్దంటూ కేసీఆర్ కి ఉత్తర్వులను జారీ చేసింది ఈసీ.. ఏప్రిల్ 5న సిరిసిల్లలో జరిగినటువంటి మీటింగ్లో  కాంగ్రెస్ పార్టీ పైన కెసిఆర్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల వల్ల ఏప్రిల్ ఆరవ తేదీన కొంతమంది కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఈ ఫిర్యాదు మేరకు కేసిఆర్ కు నోటీసు ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం.. అయితే ఈ విషయం పైన సమాధానం ఇచ్చేందుకు తమకు ఒక వారం రోజులపాటు గడువు కావాలంటూ ఈసీకి కేసీఆర్ లేఖ రాశారు.. అయితే వారం రోజులు అయిపోయిన తర్వాత కూడా కెసిఆర్ నుంచి ఈసీ కి ఎలాంటి నోటీసులు పంపకపోవడంతో కెసిఆర్ నిర్లక్ష్యం వ్యవహరించడంతో ఈసీ కేసీఆర్ పైన వేటు వేసినట్లుగా తెలుస్తోంది. మరి ఈ విషయం పైన కెసిఆర్ ఎలా స్పందిస్తారో ..టిఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి. ప్రస్తుతం ఎన్నికలు దగ్గరికి సమీపిస్తున్న వేళ ఇలాంటి నిర్ణయంతో నేతలు సైతం ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: