ప్రొద్దుటూరు: వరదరాజుల రెడ్డి గెలుపు ఖాయం.. కలిసొచ్చే అంశాలివే.!

Pandrala Sravanthi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నటువంటి  అన్ని జిల్లాలలో కెల్లా కడప జిల్లా రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. గతంలో ఈ జిల్లాలో వైసిపి మెజారిటీ సీట్లను సాధించింది.  అయితే ఈసారి ఆ పరిస్థితి లేదన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో టిడిపికి చెందిన అభ్యర్థులు ముందు స్థానంలో ఉన్నారట.. ఈ క్రమంలో పొద్దుటూరు నియోజకవర్గం  చాలా ఆసక్తికరంగా మారింది. నియోజకవర్గంలో టిడిపి నుంచి చాలా సీనియర్ నేత  పెద్దాయన వరదరాజుల రెడ్డి  పోటీ చేస్తున్నారు. ఈసారి ఈయన గెలుస్తారని ప్రజలు కూడా  భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.  

దీనికి ప్రధాన కారణం అక్కడ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి అక్రమాలు, అరాచకాలు, అంతేకాకుండా ఆయన బావమరిది బంగారు రెడ్డి కూడా  విపరీతంగా వ్యాపారస్తులను, ప్రజలను దోచుక తిన్నారట. ఈ క్రమంలోనే సీనియర్ నేత వరదరాజులరెడ్డి బరిలోకి దిగారు . అయితే ఆ నియోజకవర్గంలో ఈ నేతకు ఎంతో గౌరవం ఉండడమే కాకుండా ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఉంది. అంతేకాకుండా ఆయనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు కూడా లేవు.  ఒక పెద్దాయనలా భావిస్తారు. ఇదే తరుణంలో పెద్దాయన వరదరాజులకు మరియు శివప్రసాద్ కి రెడ్డికి మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. అయితే శివప్రసాద్ రెడ్డి ఈ పెద్దాయనకు శిష్యుడే. ఏకుపోయి మేకు అయినట్టు  శిష్యుడే ఇప్పుడు గురువుకు ప్రత్యర్థిగా మారాడు.

అయినా వరదరాజుల రెడ్డి  వెనకడుగు వేయకుండా ఈసారి తన పాత బలగాన్ని అంతా కూడగట్టి  ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో ఇదే నాకు చివరి ఎన్నిక అనే సెంటిమెంటుతో పాత నాయకులందరినీ దగ్గరకు తీసుకుంటున్నారట. అలాంటి ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో మొత్తం 2.20 లక్షలు ఓటర్లు ఉన్నారు. ఇందులో టిడిపికి ఎక్కువ సపోర్ట్ చేసే  మండలాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా  శివప్రసాద్ రెడ్డికి వైసీపీ నేతలతో కూడా  సరైన పొంతన కుదరక అనేక గొడవలు కూడా అవుతున్నాయట. ఇప్పటికే చాలామంది సర్పంచులు టిడిపిలో చేరిపోయారు. అలాగే ఇక్కడ మైనార్టీ ఓటర్లు కూడా ఎక్కువగానే ఉంటారు. గత ఎన్నికల్లో ఈ మైనారిటీలు వైసీపీకి సపోర్ట్ చేశారు.  ఈసారి కాంగ్రెస్ వైపు వెళితే, టిడిపి నుంచి పోటీ చేస్తున్న వరదరాజులు తప్పక విజయం సాధిస్తారని ఒక టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: