లక్ష్మీపార్వతి: కుప్పం లో బాబు ఓటమి ఖాయం..!
ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ.. 25 కేసులు ఉన్న చంద్రబాబు రాజకీయాలకు అనర్హుడని ఇతర పార్టీలో చంద్రబాబు నాయుడుకి కోవర్టులు చాలామంది ఉన్నారని కూడా తెలియజేస్తోంది.. తను విలువలతో కూడిన రాజకీయాలు ఎప్పుడు చేయలేదని కూడా లక్ష్మీపార్వతి తెలియజేసింది.. చంద్రబాబు ఎలాంటి దుర్మార్గుడో దగ్గరగా చూసిన తనకు బాగా తెలుసు అని టిడిపి పార్టీ స్థాపించినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నారంటూ కూడా నిలదీసింది. ఆ పార్టీ తనకు ఎలా సొంతమయ్యింది అంటూ కూడా ప్రశ్నిస్తోంది.
ఇన్నేళ్లు కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న చంద్రబాబు ఏం చేశారని చంద్రబాబుకు విలువలు విశ్వసనీయత అసలు లేదని 2014-2019 మధ్యలోని ఏకంగా 2 లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు అంటూ తెలియజేస్తోంది లక్ష్మీపార్వతి. చంద్రబాబు ఆస్తి మొత్తం ఆరు లక్షల కోట్లు అని వెల్లడించింది.. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న భరత్ గెలుపు పై తనకు విశ్వాసం ఉందంటూ తెలియజేస్తోంది 75 ఏళ్ల వయసులో చంద్రబాబు ఏం చేయగలరని సీఎం రమేష్ పేరుతో లోకేష్ ఎక్కువగా ఫ్లైట్లు కొన్నారని చంద్రబాబుకు సొంతబలం లేకపోవడం వల్లే పవన్ కళ్యాణ్ మీద ఆధారపడి తిరుగుతున్నారంటూ ఎద్దేవా చేసింది లక్ష్మీపార్వతి. ఇప్పుడు ఈ విషయం రాజకీయాలలో వైరల్ గా మారుతోంది.